ScienceAndTech

లాక్‌డౌన్‌లో బాగా పెరిగిన సైబర్ నేరాలు

లాక్‌డౌన్‌లో బాగా పెరిగిన సైబర్ నేరాలు

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు విధించిన లాక్‌డౌన్ పిరియ‌డ్ లో సైబ‌ర్ నేరాలు గ‌ణ‌నీయంగా పెరిగిన‌ట్లు రాష్ర్ట డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి తెలిపారు.

మహిళలు, పిల్లల కోసం సురక్షితమైన సైబర్ ప్రపంచాన్ని లక్ష్యంగా చేసుకుని నెల రోజుల పాటు జరిగే ఆన్‌లైన్ ప్రచారం ‘సైబ్ హ‌ర్’ ను డీజీపీ నేడు ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా డీజీపీ మాట్లాడుతూ… సైబర్ ప్రమాదాలు, ప్రతికూల చర్యల గురించి ఇంటర్నెట్ వినియోగదారులకు మరింత అవగాహన కలిగించేలా ప్ర‌చార కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ట్లు తెలిపారు.

తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ నిర్వహిస్తున్న ఈ ప్రచారానికి యునిసెఫ్ ఇండియా అవసరమైన సహకారాన్ని అందిస్తోందన్నారు.

ఆన్‌లైన్ ముప్పు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మహిళలు, పిల్లలకు అవగాహన కల్పించడమే ఈ ప్రచారం వెనుక ప్రధాన ఉద్దేశం అన్నారు.

కార్య‌క్ర‌మంలో భాగంగా వ్యాస ర‌చ‌న‌, గ్రూప్ డిస్క‌ష‌న్స్ వంటి ఇత‌ర కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు.

క్రీడ‌లు, సినిమా రంగం, న్యాయ రంగం, సైకాల‌జిస్టులు, సైబ‌ర్ క్రైం నిపుణులు, విద్యార్థులు, కౌన్సిల‌ర్లు ఈ ప్రారంభ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.