మనము బైక్ మీద వెళ్తుంటే?
వేగంగా దూసుకు పోతున్న కారు వైపు చూస్తాముగాని,
మన ప్రక్కనే చెమటలుకక్కుతూ సైకిల్ తొక్కుతున్న వ్యక్తిని పట్టించుకోము.
మన ఆశలన్నీ మనపైవాటి మీదే వుంటాయి.
? నేను ఆ స్థితిలో ఎందుకు లేను?
అనే తలంపు మన జీవితంలో అసంతృప్తిని, మనకంటే ఉన్నత స్థితిలో వున్నవారిపైన ‘అసూయను’ కలిగిస్తుంది.
? ‘అసూయ’ ఎంత భయంకరమైనది అంటే?
?అసూయ కలిగిన నీవు సంతోషముగా వుండలేవు. ఎదుట వారిని సంతోషముగా వుండనివ్వవు.
మనం చేసే పని మంచిదా! కాదా? అనే వివేచన అసూయకు ఉండదు.
♻ అసూయ వలన తనను తానే చంపుకొన్న ఒకని గాధ
క్రీడారంగంలో గెల్చిన ఒక గజ ఆటగాని గౌరవార్థం పురజనులు కొందరు అతని శిలా ప్రతిమ చేయించి నిలబెట్టారు. ఆ విధంగా సన్మానింపబడిన ఆటగానిపై తీరని అసూయతో ఒక ప్రత్యర్ధి ఆ శిలా విగ్రహం ఎలా అయినా పాడుచేయాలని ప్రతిజ్ఞ పట్టాడు. ప్రతి రాత్రి దొంగచాటుగా వెళ్ళి దాని పీఠాన్ని ఉలితో కొద్దికొద్దిగా తొలిచివేస్తూ ఉండేవాడు. ఆ విధంగా చేస్తే దాని పునాది బలహీనమై పడిపోవాలని అతని కోరిక. అతడు అనుకొన్నది సాధించాడు. ఒకనాడా విగ్రహం దబాలున పడిపోయింది.
కాని అతని మిాదే పడింది. తన అసూయకు తానే బలి అయ్యాడు.
? మనకంటె సంపదలు గలవారిని చూచి అసూయ పడినంత మాత్రాన మనకు ఒక పైసాకూడా కలిసిరాదు సరిగదా, మన ఆత్మ దివాలా తీస్తుంది.
? ఇతరులది అదృష్టం తనది దురదృష్టం అని,
? పరుల విజయం తన పరాజయమని,
? పొరుగువారి ఆశీర్వాదం తనకు శాపమని అసూయపరుడు ఎందుకో బాధపడుతుంటాడు.
ఇక దాని ఫలితం ఏమిటంటే, ఈ విధంగా తన మనస్సులో ఆత్మలో బాధపడ్తూంటే నిజముగానే అపజయం తధ్యం.