చైనా వ్యతిరేక భావన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో పెరుగుతోంది.
ఈ క్రమంలో ఆశ్చర్యకరంగా చాలా మంది పాకిస్తానీయులు ఇప్పుడు భారతీయులకు సంఘీభావం తెలుపుతున్నారు.
చైనా సామ్రాజ్య విస్తరణవాదానికి వ్యతిరేకంగా తమ గొంతును వినిపించేందుకు ముందుకు వస్తున్నారు.
ఇటువంటి ఘటనే యూకేలో ఈ నెల 12వ తేదీన చోటుచేసుకుంది.
చైనా విధానాలకు నిరసనగా లండన్‌లోని చైనా రాయబార కార్యాలయం వెలుపల భారతీయులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈ నిరసన కార్యక్రమంలో భారతీయులతో కలిసి చాలా మంది పాకిస్తానీయులు కూడా పాల్గొన్నారు.
చైనా విధానాలపై భారతీయులతో కలిసి నిరసనను తెలియజేశారు.
భారతీయులతో కలిసి జాతీయ గీతం జనగణమన తోపాటు జాతీయ గేయం వందేమాతరం ఆలపించారు.
నిరసనలలో పాకిస్తాన్ మానవ హక్కుల కార్యకర్త ఆరిఫ్ అజాకియా పాల్గొన్నాడు.
ఈ సంఘటన వీడియోలుగా తీసి షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి.
తన జీవితంలో మొదటిసారి జన గణ మన పాడినట్లు అజాకియా తెలిపారు.
భారత్, పాక్ నుంచి నిరసనకారులు చైనా వ్యతిరేక ప్లకార్డులు ప్రదర్శించారు.
చైనా డౌన్, చైనాను బహిష్కరించండి అంటూ నినాదాలు చేశారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని మీర్పూర్ కు చెందిన అంజద్ అయూబ్ మీర్జా ఈ నిరసనలో పాల్గొన్నాడు.
ఈ నిరసనలో పాల్గొనేందుకు తాను గ్లాస్గో నుంచి వచ్చినట్లు తెలిపాడు.
చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా గిల్గిట్-బాల్టిస్తాన్ అంతటా చైనీయులు వినాశనం చేస్తున్నారన్నారు.