Food

అల్లం+అశ్వగంధ ప్రయత్నించారా?

Telugu Food News - Ginger Aswagandha To Battle COVID19

ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ కల్పించాలంటే కొన్ని మూలికలను ప్రధానంగా తీసుకోవాలి. అవేంటంటే… ఊ తులసి: ఆయుర్వేద వైద్యంలో తులసిది కీలక పాత్ర. కాబట్టి ఈ మొక్క ఆకులతో కషాయం కాచి తాగవచ్చు. టీలో వేసి మరిగించవచ్చు. లేదంటే నేరుగా ఆకులనే నమలవచ్చు. ఎలా తీసుకున్నా తులసిలోని ఔషధగుణాలు వ్యాధి నిరోధకశక్తిని పెంచడంతో పాటు శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. ప్రతి రోజూ కొన్ని తులసి ఆకులను క్రమం తప్పక తీసుకుంటూ ఉండాలి.
*అల్లం:
అల్లం లేదా శొంఠి శ్వాసకోస సమస్యలను తగ్గిస్తాయి. వీటిలోని ఔషధగుణాలు శరీరంలో తలెత్తే వాపులను అదుపు చేస్తాయి. కాబట్టి కషాయం లేదా టీలో అల్లం రసం కలిపి తాగాలి. వేడి ఒళ్లు కలిగిన పిత్త శరీర తత్వం ఉన్న వారైతే అల్లాన్ని పరిమితంగా వాడాలి.
*పసుపు:
వ్యాధులతో పోరాడే గుణం పసుపునకు ఉంది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా పసుపును విరివిగా వాడతారు. కండరాల నొప్పులు తగ్గించడంతో పాటు గాయాలను మాన్పే గుణం కూడా పసుపుకు ఉంటుంది. కఫాన్ని కరిగించి, వెలుపలికి రప్పించే గుణం ఉన్న పసుపును వేడి పాలలో కలిపి తీసుకుంటే ఊపిరితిత్తులు బలపడతాయి.
*అశ్వగంధ:
ఈ మూలిక శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికీ ఉపయోగపడుతుంది. ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి లాంటి సమస్యలను పరిష్కరిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా కలిగి ఉండే అశ్వగంధ వ్యాధినిరోధకశక్తినీ పెంచుతుంది.