DailyDose

అలిపిరిలో కరోనా పాజిటివ్ కేసులు-TNI బులెటిన్

TNILIVE COVID19 Bulletin - Alipiri Coronavirus Positive Cases

* తిరుమలలో 8 మంది అర్చకులకు Covid +ve. అలిపిరి COVID టెస్టింగ్ సెంటర్ లో ఒకరికి పోజిటివ్. Covid టెస్టింగ్ సెంటర్ మూసివేత.

* గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ లో క‌రోనా వీర‌విహారం చేస్తోంది.రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య ప్ర‌మాద‌క‌రంగా పెరుగుతోంది.అధికారులు యుద్దప్రాతిప‌దిక‌న నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ప్ప‌టికీ వ్యాధి వ్యాప్తి అదుపులోకి రావ‌డం లేదు.దీంతో మ‌రింత అలెర్టయ్యింది జీహెచ్ఎంసీ యంత్రాంగం.

* రాష్ట్రంలో కొత్తగా 2,432 కరోనా పాజిటివ్‌ కేసులురాష్ట్రంలో 35,451కి చేరిన కరోనా కేసులురాష్ట్రంలో కరోనాతో మరో 44 మంది మృతిరాష్ట్రంలో 452కి చేరిన కరోనా మరణాలుఅనంతపురం, ప.గో.జిల్లాల్లో 9 మంది చొప్పున మృతికర్నూలు జిల్లాలో కరోనాతో మరో ఐదుగురు మృతిచిత్తూరు, విశాఖ, తూ.గో.జిల్లాలో నలుగురు చొప్పున మృతికడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతినెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్కొక్కరు మృతిరాష్ట్రంలో కరోనాతో చికిత్స పొందుతున్న 16,621 మంది బాధితులురాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 18,378 మంది డిశ్చార్జి24 గంటల వ్యవధిలో 22,197 నమూనాలు పరీక్షరాష్ట్రంలో ఇప్పటివరకు 12.18 లక్షల మందికి కరోనా పరీక్షలు.

* జీహెచ్ఎంసీ పరిధిలో పెరుగుతున్న కరోనా కేసులు నగర వాసులను భయభ్రాంతులకు గురిచేస్తుండగా, తాజాగా నగరంలోని గాంధీ భవన్‌లో కరోనా కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన ఇందులోని కరోనా కంట్రోల్ రూములో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన నేతలు పార్టీని వారం రోజులపాటు మూసివేయాలని నిర్ణయించారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది గాంధీభవన్‌కు చేరుకుని పరిసరాలను శానిటైజ్ చేస్తున్నారు.

* భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 29,429 కేసులు.. 562 మరణాలు సంభవించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా కేసులు 9,36,181కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 24,309 మంది ప్రాణాలు కోల్పోయారు. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 3,19,840 మంది చికిత్స పొందుతుండగా.. 5,92,032 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్రం తెలిపింది.