భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ ఇటీవల తన బీఎండబ్ల్యూ కారు అమ్మకం కోసం సోషల్మీడియలో పోస్టు చేయడం, దాన్ని తొలగించడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై బుధవారం ట్విటర్ వేదికగా ఓ పోస్టు చేసిన ఆమె అంత లగ్జరీ కారును ఎందుకు అమ్మాలనుకుంటున్నదీ వివరించారు. అందరూ అనుకుంటున్నట్లు శిక్షణ కోసం కాదనీ, ఆ కారుకు అయ్యే నిర్వహణ ఖర్చులు భరించలేక అమ్మాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అలాంటి కారు ఉండటం తనకు ఇష్టమే అయినా, దాన్ని నిర్వహించేంత ఆర్థిక స్థోమత తనకు లేదని చెప్పారు. ఆ కారును ఎక్కువగా వాడటం లేదని, అలాగే తన శిక్షణ కోసమే దాన్ని అమ్మాలనుకుంటున్నట్లు ఎప్పుడూ చెప్పలేదని ఆ ప్రకటనలో వివరించారు.
BMW Maintenance ఖర్చులు భరించలేక….
Related tags :