విజయవాడ డ్రగ్స్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు.
డ్రగ్స్ అమ్ముతూ ఇద్దరు విదేశీయులు విజయవాడలో అరెస్టు కావటం రెండోసారి.
గతంలో సీపీ ద్వారక తిరుమల రావు సమయంలో అరెస్టు కాబడిన ఇద్దరు విదేశీయులు.
యువతకు డ్రగ్స్ అమ్మకంలో కీలక పాత్రధారి కోనేరు అర్జున్.
సూడాన్ కి చెందిన రసూల్, టాన్జనియాకి చెందిన యోనా నుంచి డ్రగ్స్ కొని కాలేజ్ విద్యార్థులకు అమ్ముతున్న కోనేరు అర్జున్.
పెనమలూరు పీఎస్ పరిధిలో ఓ కళాశాల లో బీటెక్ చేసిన అర్జున్.
అప్పటి పరిచయాలు, ఇతర కళాశాలల్లో విద్యార్థుల పరిచాయలతో డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్న అర్జున్.
అర్జున్ దగ్గర డ్రగ్స్ కొన్న వారిని విచారించే ఆలోచనలో పోలీసులు.
విదేశీయుల పాస్ పోర్టు సీజ్ చేయటానికి చర్యలు.