WorldWonders

పాముకాటుకు 12లక్షల మంది బలి

పాముకాటుకు 12లక్షల మంది బలి

ప్రపంచవ్యాప్తంగా పాముకాటుతో సంభవిస్తున్న మరణా ల్లో 50% భారత్‌లోనే నమోదవుతున్నా యి. గత ఇరవై ఏళ్లలో దేశంలో 12 లక్షల మంది అంటే ఏడాదికి 6 వేల వంతున.. మృత్యువాత పడినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో ప్రధానంగా జూన్‌–సెప్టెంబర్‌ మధ్య ఈ పరిస్థితి ఎక్కువుందని తేలిం ది. గతంలోని ‘మిలియన్‌ డెత్‌ స్టడీ’ నివేదిక గణాంకాల ఆధారంగా దేశ, విదేశీ నిపుణులు నిర్వహించిన అధ్యయనాన్ని‘ఓపెన్‌–యాక్సెస్‌ జర్నల్‌ ఈ–లైఫ్‌’తాజా సంచికలో ప్రచురిం చారు. ఈ పరిశీలన ప్రకారం 2001–14 మధ్య 70% పాముకాటు మరణాలు బి హార్, మధ్యప్రదేశ్, ఒడిశా, యూపీ, ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్‌లోనే చోటుచేసుకున్నాయి. భారత్‌లో ఎక్కువగా రస్సెల్స్‌ వైపర్స్, 8 రకాల క్రే ట్స్, 4 రకాల నాగుపాముల కాటు కారణంగా మరణాలు సంభవిస్తున్న ట్టు వెల్లడైంది. వేగంగా చికిత్స అందించ కే మరణాలకు ఆస్కారం ఏర్పడుతోం దని పరిశీలకులు తేల్చారు.