తిరుమలలో ముగిసిన టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి సమీక్ష సమావేశం
దర్శనాలు ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు మొత్తం 140 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ బారిన పడ్డారు
ఇందులో సెక్యూరిటీ విభాగంలో సేవలందించే ఏపీఎస్పీ బెటాలియన్ లోని 60 మంది సిబ్బంది ఉన్నారు
ప్రసాదాలు తయారు చేసే పోటు కార్మికులకు 16 మందికి కరోనా సోకింది
అర్చకులకు 14 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది
ఇందులో మొత్తం 70 మంది ఉద్యోగులు కోలుకుని సాధారణ జీవితం గడుపుతున్నారు
డ్యూటీలకు కూడా హాజరవుతున్నారు
గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి
అర్చకులకు కరోనా సోకడాన్ని రాజకీయ రంగు పులమడం సరికాదు
గౌరవ ప్రధాన అర్చకులుగా వివాదాస్పద వ్యాఖ్యలు మీడియా వేదికగా మాట్లాడటం సరికాదు
మా ప్రభుత్వం వచ్చిన తరువాత గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించి గౌరవ వేతనాన్ని ఇస్తున్నాం
రమణదీక్షితులు తో పిలిపించి మాట్లాడమని ఈఓ అదనపు ఈఓ కోరుతాం టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి