DailyDose

భూమా అఖిలప్రియను అరెస్ట్ చేయాలి-నేరవార్తలు

YV Subbareddy Demands Bhuma Akhilapriya Arrest

* కడపజిల్లా ఎస్పీని కలిసిన ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి..తన పై హత్యా యత్నం కేసు విషయమై ఎస్పీ అన్బు రాజన్ ను కలిసిన ఏవీ సుబ్బారెడ్డి, ఆయన కుమార్తె జస్వంతి..ఏవీ సుబ్బారెడ్డి కామెంట్స్..భూమా అఖిల ప్రియను వెంటనే అరెస్ట్ చేయాలని కడపజిల్లా ఎస్పీని కోరాం..భూమా అఖిలప్రియను అరెస్టు చేయకపోవడం వెనుక ఏదైనా మతలబు జరుగుతోందా..?ప్రొసీజర్ ప్రకారమే కేసు ముందుకు నడుస్తోందన్న ఎస్పీ అన్బు రాజన్..ఏ4 అయిన భూమా అఖిల ప్రియను ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని పోలీసులను ప్రశ్నిస్తున్నా..?ఏ1 నుండి ఏ6 వరకు అందరినీ అరెస్టు చేసిన పోలీసులు ఏ4ను ఎందుకు వదిలేశారు..నన్ను హత్య చేసేందుకు భూమా కుటుంబం సఫారీ ఇచ్చిన మాట వాస్తవం కాదా..ఇప్పటికే మూడు నోటీసులు ఇచ్చినా అఖిల ప్రియ, ఆమె భర్త నుండి ఎలాంటి స్పందన లేదు..ముందస్తు బెయిల్ వస్తే వాళ్ళు పోలీసులకు పలికే పరిస్థితి లేదు..ఇది ఇలాగే కొనసాగితే నాపై మళ్లీ దాడిచేసి అవకాశాలు ఉన్నాయి..నోటీసులకు స్పందించని అఖిలప్రియ, ఆమె భర్త నిర్భయంగా బయట తిరుగుతున్నారు..

* విశాఖజిల్లా పాడేరు మండలం కావురాయి గ్రామంలో ఎక్స్చేంజ్సి. ఐ. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో 3600లీటర్లు బెల్లం పులుపు ధ్వసం చేసిన మహిళ పోలీస్,మొబైల్ పార్టీ వాలంటీర్లు

* విశాఖజిల్లాలో రెచ్చిపోయిన రౌడీషీటర్లురాజకీయ నాయకులు జన్మదిన వేడుకలు లాగా రౌడీషీటర్ బర్త్ డే వేడుకలుఅనకాపల్లి మామిడి పాలెం శివారు సరుగుడు తోటల్లో పేరు మోసిన రౌడీషీటర్ బర్త్ డే సెలబ్రేషన్స్హజరైన 30 మంది బడా చోటా మోటా రౌడీషీటర్ల్గ్రామ శివార్లలోని తోటల్లో మద్యంతో విందు వినోదాలతో చెలరేగిన రౌడీ షీటర్లుజిల్లా ఎస్పీ కృష్ణారావుకు సమాచారం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులుఅయితే పోలీసులు వస్తున్నారని పసిగట్టిన రౌడీ షీటర్లు అక్కడి నుండి పరారయ్యారు.పోలీసులు నుండే సమాచారం లీక్ అయ్యిందని భావిస్తున్న పోలీసు ఉన్నతాధికారులుకొద్దిరోజుల క్రితం గాజువాకలో బౌన్సర్లతో హోటల్లో పార్టీ చేసుకున్నా రౌడీషీటర్ చిట్టిమాము.టాస్క్ ఫోర్స్ ఆఫిసర్లు చేసిన దాడుల్లో పలువురు అరెస్ట్ఇటీవలే రౌడీ మేళ నిర్వహించిన పోలీసులురౌడీమూకలు పార్టీ పై విచారణ చేస్తున్న పోలీసులు.

* గుత్తిలో దొంగల బీభత్సం.జాక్వెండ్ రెడీమేడ్ గార్మెంట్ షాపులో చోరీ.సుమారు 4లక్షల విలువ చేసే దుస్తులు, 3,వేలు ఐదు వందల నగదు అపహరణ.

* 3 లక్షల విలువైన గుట్కాలు, నిషేధిత సిగరెట్లు పట్టించిన కొడాలి రాజేష్.పట్టణంలోని కాలేజీ రోడ్డు లో ఓ ఇంటి పరిసరాల్లో నిల్వచేసిన గుట్కా,పాన్ మాషాలా, నిషేధిత సిగరెట్లు సమాచారాన్ని ఉయ్యురు పోలీసులకు చేరవేసి పట్టించిన కొడాలి రాజేష్.మొత్తం13 బస్తాలు సీజ్ చేసిన ఉయ్యూరు పట్టణ పోలుసులు.ఉయ్యూరు సిఐ నాగ ప్రసాద్ సిబ్బందితో దాడి.ఉయ్యూరు పట్టణ ఇంచార్జి ఎస్సై దుర్గ మహేశ్వర రావు సుబ్బారావు అనే వ్యక్తి ని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

* మధ్యప్రదేశ్‌ గుణా జిల్లాలోని కాంట్‌ ప్రాంతంలో ఆక్రమణలను తొలగించడానికి వెళ్లిన పోలీసులు ఓ రైతు దంపతులను కర్రలతో చితకబాదారు.ఆ తర్వాత రైతు దంపతులు పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా స్థానికులు వెంటనే దవాఖానకు తరలించి కాపాడారు.ఈ ఘటన వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తుండగా స్పందించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గుణ జిల్లా కలెక్టర్, ఎస్పీని వెంటనే సస్పెండ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.

* ఒంగోలులో వైసీపీకి చెందిన ఓ ప్రముఖ బంగారు వ్యాపారి ఇంట్లో అర్ధరాత్రి వరకు కస్టమ్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు.నిన్న ఉదయం తమిళనాడులోని ఎలావూర్ చెక్ పోస్టు వద్ద నాలుగు కోట్ల రూపాయల నగదుతో పాటు బంగారం పట్టుబడిన వైనం తెలిసిందే.లాక్‌డౌన్ సమయంలో విపరీతంగా అక్రమ బంగారం వ్యాపారం జరిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.పట్టుబడిన కారుపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్టిక్కర్ ఉండటంతో ఆయనకు సంబంధించిన వాహనంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.దీంతో వెంటనే స్పందించిన మంత్రి బాలినేని.. పట్టుబడిన వాహనానికి తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.కారుపై తన పేరుతో జెరాక్స్ స్టిక్కర్లు వాడారని… వాహనంలో పట్టుబడిన సొత్తుతో తమకు సంబంధం లేదని తెలిపారు.ఘటనపై పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని మంత్రి బాలినేని పేర్కొన్నారు.