తెలుగు భాషాభిమానులకు తీపి కబురు. ఖండాంతరాల్లో వ్యాపించిన తెలుగు భాషకు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం లభించింది. అక్కడి బడుల్లో తెలుగును ఐచ్ఛిక అంశంగా చేరుస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఒకటి నుంచి పన్నెండు తరగతి వరకు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో ఇకపై తెలుగు భాషను నేర్చుకునే అవకాశం కలగనుంది. ఈ ప్రకటన స్థానిక తెలుగువారినే కాకుండా యావత్ ప్రపంచంలోని తెలుగువారికి ఆనందాన్ని కలిగిస్తోంది. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు హిందీ, పంజాబీ, తమిళ భాషలకు మాత్రమే అక్కడి ప్రభుత్వ గుర్తింపు లభించింది. తాజాగా ఆ జాబితాలో నాలుగో భాషగా తెలుగు చేరింది. దీంతో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, సిడ్నీ, విక్టోరియా, న్యూసౌత్‌వేల్స్, క్వీన్స్‌లాండ్, సౌత్ ఆస్ట్రేలియా మొదలైన రాష్ట్రాల్లోని తెలుగువారికి ప్రయోజనం కలగనుంది.
ఆస్ట్రేలియా పాఠశాలల్లో తెలుగు పాఠాలు
Related tags :