Fashion

కాగితపు గాజులు

Make your own paper bangles - Telugu fashion news

గల గల లాడే గాజులు.. నిశబ్దంగా మీ చేతులకి అందంగా అమరితే… అదీ రంగు రంగుల్లో..? బావుంటుంది కదా.. ఇప్పుడు అమ్మాయిలు కాలేజీకి ఈ గాజులని చక్కగా వేసుకుని లేటెస్ట్‌ ఫ్యాషన్‌ ఇదే అంటున్నారు. పైగా సొంతంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. దాంతో వేసుకునే డ్రెస్‌కి తగ్గట్టు కొంతమంది అమ్మాయిలు గాజులు రెడీ చేసేసుకుంటున్నారు. కొంచెం క్రియేటివ్‌గా ఆలోచిస్తే ఎవరైనా ఈ గాజులు తయారు చేసుకోవచ్చు. కోవిడ్‌ కారణంగా కాలేజీలు ఇంకా తెరవలేదు కాబట్టి. ప్రస్తుతం ఇంట్లోనే వుంటున్నాం. మరింకెందుకు ఆలస్యం.. మీ మెదడుకు కాస్త పని పెట్టండి.