Movies

స్నానం తర్వాతే ఏదైనా…

Nidhi Agarwal On COVID19 Routine Schedule

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది. కేసులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ కరోనా వైరస్‌ ప్రపంచానికి చాలా నేర్పించిందని హీరోయిన్ నిధి అగర్వాల్ అభిప్రాయపడింది. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే నిధి లాక్‌డౌన్ కారణంగా దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నానని తెలిపింది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి తెలిపింది. `రోజూ నేను బయటకు వచ్చేది నా పెంపుడు కుక్కతో వాకింగ్ చేసేందుకు మాత్రమే. మాస్క్, గ్లౌవ్స్, ఫేస్ షీల్డ్ వేసుకున్నాకే బయటకు వెళ్తా. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కుక్క గొలుసుతోపాటు ప్రతి వస్తువునూ శానిటైజ్ చేస్తున్నా. కుక్కకి స్నానం చేయించి, నేను స్నానం చేసిన తర్వాతే’ అని తెలిపింది. అలాగే లాక్‌డౌన్ సమయంలో ఓ ఆన్‌లైన్ యాక్టింగ్ క్లాస్‌లో జాయిన్ అయ్యానని, సాంకేతిక విషయాలకు సంబంధించిన అంశాల గురించి శిక్షణ తీసుకున్నానని చెప్పింది. ఎలా అయితే ఎంటి హీరోయిన్ నిధి అగర్వాల్‌కు మాత్రం బాగానే ఉపయోగ పడింది.