* శ్రీకాకుళంలో నేటి నుంచి 14 రోజుల పాటు లాక్‌డౌన్ మరింత కఠినతరం. అత్యవసర సరుకులు, మెడికల్ షాపులు మినహా మిగిలిన అన్ని దుకాణాలు మూసివేత..ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ మాత్రమే నిత్యావసర దుకాణాలకు అనుమతి.
* నెల్లూరు జిల్లాలో 22 మంది జర్నలిస్టు లకు కరోనా పాజిటివ్కరోనా బారిన పడిన జర్నలిస్టు లందరూ నెల్లూరు నగరానికి చెందినవారే.జర్నలిస్టుల కుటుంబాల్లో ఆందోళన.
* 53 కొవిడ్ మరణాలతో , 3963 పాజిటివ్ కేసులతో కరోనా మరింత ప్రబలుతోంది.ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా 12 మరణాలు 994 పాజిటివ్ కేసులతో ముందుంది.అన్ని జిల్లాల్లోనూ కరోనా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ ఉందిరోడ్డు మీద ఉన్న కరోనా ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించకపోవడం వలన వంట్లోని , ఇంట్లోకి తెచ్చుకుంటున్నాము. మనతో పాటు మన కుటుంబ సభ్యులను మన చుట్టూ ఉన్నవారికి కూడా మన అజాగ్రత్త వలన దీనిని వ్యాప్తి చేస్తున్నాము.అందరూ రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్న జాగ్రత్తలు తూచా తప్పకుండా పాటించవలసిన ది.స్టేట్ నోడల్ అధికారి కరోనా19
* దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 10,38,716 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ.గడచిన 24 గంటల్లో 34,884 పాజిటివ్ కేసులు నమోదు కాగా 671 మంది మృతి.3,58,692 మందికి కొనసాగుతున్న చికిత్స.కరోనా నుండి ఇప్పటి వరకు కోలుకున్న 6,53,751మంది బాధితులు.కోవిడ్-19 వైరస్ సోకి ఇప్పటివరకు 26,273 మంది మృతి.నిన్న ఒక్కరోజే కోలుకున్న 17,994 మంది బాధితులు.
* ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. సాధారణ ప్రజలతో పాటు అధికారులు ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా ను అదుపు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుంది. అయిన్పటికీ కేసుల సంఖ్య తగ్గడంలేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా తో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఇప్పుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కరోనా అనుమానంతో ఆయన టెస్ట్ చేసుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఇక ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా కరోనా బారిన పడ్డారు