నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల్లో పెరుగుతున్న ఆశలు.
ముందస్తుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతుండటంతో నీటి విడుదలపై చిగురిస్తున్న ఆశలు.
వరద ప్రవాహం గతేడాది కంటే ముందుగానే రావొచ్చని అంచనా వేస్తున్న అధికారులు.
నాగార్జునసాగర్ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 530 అడుగులు,
మొత్తం నీటిమట్టం 590 అడుగులు.
312.04 టీఎంసీలకు గాను ప్రస్తుతానికి 167.75 టీఎంసీల వద్దనున్న సాగర్ జలాశయం.
సాగర్ జలాశయంలోకి 500 క్యూసెక్కుల నీటి ప్రవాహంతో సమానంగా ఉన్న ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో.
ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం అధికంగా ఉంటే
ఈసారి సాగర్ జలాశయానికి వరద తాకిడి గత ఏడాది కంటే ముందుగా రావొచ్చని అంచనా వేస్తున్న నీటి పారుదలశాఖ అధికారులు.
గత ఏడాదితో పోలిస్తే ఈసారి సాగర్ జలాశయంలో అధికంగా ఉన్న 40 టీఎంసీల నీరు.
ఎందుకంటే ఏడాది క్రితం వరదలు వచ్చి సాగర్ జలాశయం 590 అడుగులకు చేరుకుంది.
ఈ తరుణంలో పలు సందర్భాల్లో గేట్ల ద్వారా వరదను దిగువకు వదిలిన అధికారులు.
సాగర్ ఆయకట్టుకు కుడి,ఎడమ కాల్వల ద్వారా వానాకాలం, యాసంగి పంటలకు నీరు.
ఈ సారి కూడా వానాకాలం,యాసంగి పంటలకు నీరు వస్తుందని ఆశిస్తున్న ఆయకట్టు రైతులు.