టీమ్‌ఇండియా ఆటగాడిగా కెరీర్ ముగిసిన అనంతరం ఏం చేయాలనే విషయంపై మాజీ సారథి కపిల్ దేవ్ సూచనలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. భారత మహిళా జట్టు కోచ్ డబ్ల్యూవీ రామన్‌తో ఆన్‌లైన్‌లో ముచ్చటించిన ద్రవిడ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘క్రికెటర్‌గా నా కెరీర్ ముగిసిన అనంతరం ఏం చేయాలో తొలుత పాలుపోలేదు. అప్పుడే కపిల్ దేవ్ ఒక మంచి విషయం చెప్పాడు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని.. కొన్నేళ్లు ఏదో ఒక పనిచేస్తూ నీకు ఏం నచ్చుతుందో దాని మీద ధ్యాసపెట్టమన్నాడు. ఆ మాటలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
కపిల్ సలహాలు అలా పనిచేశాయి
Related tags :