NRI-NRT

ఆటా “ఝుమ్మంది నాదం” నాన్-క్లాసికల్ ఫైనలిస్టులు వీరే

ATA Jhummandhi Nadam 2020 Singing Competitions Non-Classical Winners

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో ‘ఝుమ్మంది నాదం’ పేరిట నాన్‌ క్లాసికల్‌ పాటల పోటీలను నిర్వహించారు. జులై 4, 5, 11 తేదీల్లో జూమ్‌ ద్వారా నిర్వహించిన ఈ పోటీల్లో అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి 80 మంది గాయనీ, గాయకులు పాల్గన్నారు. ఆటా బోర్డు ఆఫ్‌ ట్రస్టీ రామకృష్ణ ఆల, శారదా సింగిరెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సంగీత దర్శకులు, నేపథ్య గాయకులు అయిన శ్రీని ప్రభల, రాజశేఖర్‌ సూరిభొట్ల, నిహాల్‌ కొండూరి, సురేఖ మూర్తి దివాకర్ల, కార్తీక్‌ కొడకండ్ల, నూతన మోహన్‌, ప్రవీణ్‌ కుమార్‌ కొప్పోలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీల్లో మొత్తం 15 మంది ఫైనలిస్టులుగా ఎంపికయ్యారు. వీరికి ఆటా ప్రెసిడెంట్‌ పరమేశ్‌ భీంరెడ్డి, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ భువనేశ్‌ రెడ్డి భుజాల, బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌, స్టాండింగ్‌ కమిటీ సభ్యులు, రీజినల్‌ డైరెక్టర్స్‌, రీజినల్‌ కో ఆర్డినేటర్స్‌, ఆటా 2020 కన్వెన్షన్‌ టీమ్‌, ఝుమ్మంది నాదం టీమ్‌, సోషల్‌ మీడియా టీమ్‌ సభ్యులు అభినందనలు తెలియజేశారు.ఆగస్టు 2న సెమీఫైనల్స్‌, ఆగస్టు 8, 9 తేదీల్లో ఫైనల్స్‌ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ప్రోత్సహించిన అందరికీ ఆటా ప్రెసిడెంట్‌ పరమేష్‌ భీంరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

*** ఫైనలిస్టులు వీరే..
అభిజ్ఞ ఎనగంటి, అభిరాం తమన్న, ఆదిత్య కార్తీక్‌ ఉపాధ్యాయుల, అదితి నటరాజన్‌, అంజలి కందూర్‌, హర్షిణి మగేశ్‌, హర్షిత వంగవీటి, లాస్య దూళిపాళ్ల, మల్లిక సూర్యదేవర, మేధ అనంతుని, ప్రణీత విష్ణుభొట్ల, రోషిణి బుద్ధ, శశాంక ఎస్‌.ఎన్‌, శ్రియ నందగిరి, ఐశ్వర్య నన్నూర్‌