Business

పైపైకి పెరిగిపోతున్న బియ్యం ధరలు

పైపైకి పెరిగిపోతున్న బియ్యం ధరలు

సామాన్యులకు షాక్.. పెరిగిన బియ్యం ధరలు..

సామాన్యులకు షాకిస్తూ గత కొద్దిరోజులుగా సన్న బియ్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

సాధారణ బియ్యంతో పోలిస్తే బాస్మతీ రకం ధర కొంత ఎక్కువగా ఉందని చెప్పాలి.

లాక్ డౌన్ నుంచి ఇప్పటివరకు కిలోకు పది రూపాయలు వరకు పెరిగింది.

అలాగే సన్నబియ్యం ధర గత నెల రోజుల్లో క్వింటాకు రూ. 350 నుంచి రూ. 400 వరకు పెరిగింది.

ఇక ప్రస్తుతం సన్నబియ్యం క్వింటా ధర రూ. 5 వేలు దాటింది.

పెరుగుతున్న డీజిల్ ధరల ప్రభావం సరుకు రవాణాపై పడుతుండటంతోనే బియ్యం ధరలు ఎగబాకుతున్నాయని వ్యాపారాలు చెబుతుండగా..

అధికారులు మాత్రం ధరలు నియంత్రణలోనే ఉన్నాయని అంటున్నారు.