Movies

నేను హీరోయిన్ అవుతున్నాను

నేను హీరోయిన్ అవుతున్నాను

కావ్య… ఈ పేరు బహుశా ఎవరికీ తెలియకపోచ్చు. కానీ అల్లు అర్జున్‌ మొదటి సినిమా ‘గంగోత్రి’లోని ‘వల్లంకి పిట్ట.. వల్లంకి పిట్ట…’ పాటని గుర్తు చేస్తే టక్కున ఆ పాటలోని చిన్నారి పాప గుర్తొస్తుంది. ఆ పాపే కావ్య. ఇప్పుడు తను హీరోయిన్‌ కాబోతోంది. తెలుగమ్మాయి అయిన కావ్య పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ – ‘‘బాలు, అడవిరాముడు, అందమైన మనసులో, విజయేంద్రవర్మ’తో పాటు ఇంకా చాలా సినిమాల్లో బాలనటిగా చేశాను. పుణెలోని ఓ కాలేజీలో లా పూర్తి చేసి, ఇప్పుడు సినిమా వైపు దృష్టి పెట్టాను.ెలుగుతో పాటు తమిళ, మళయాళ సినిమాలకు కూడా ఆడిష¯Œ ్స చేస్తున్నాను. నిజానికి లాక్‌ డౌన్‌కి ముందుగానే ట్రయిల్స్‌ స్టార్ట్‌ చేశాను. లాక్‌ డౌన్‌ రాకుండా ఉంటే ఓ ప్రాజెక్ట్‌ ఓకే అయ్యేది. నేను తెలుగు అమ్మాయిని కావడం అడ్వాంటేజ్‌గా ఫీలవుతున్నాను. మన తెలుగు కల్చర్, నేటివిటీ అనేది హిందీ హీరోయిన్ల కన్నా తెలుగు అమ్మాయిలకే అర్థమవుతుంది. రియాలిటీకి దగ్గరగా ఉండే, ఇంట్రెస్టింగ్‌ , ఛాలెంజింగ్‌ పాత్రలంటే ఇష్టం. ఓటీటీలో డిఫరెంట్‌ సబ్జెక్ట్స్‌ వస్తున్నాయి. అలాంటి అవకాశం నాకు వచ్చి, పాత్ర ఆసక్తిగా అనిపిస్తే చేస్తాను’’ అని చెప్పారు.