Fashion

బొట్టు దగ్గర మచ్చ వచ్చిందా?

Does your skin has a spot on your forehead due to kumkum?

స్టిక్కర్‌ పెట్టుకునే చోట మచ్చ వచ్చింది. అక్కడ దురద కూడా వస్తోంది. పోనీ బొట్టు లేకుండా బయటకు వెళదామంటే ఇబ్బందిగా ఉంటోంది. ఈ మచ్చ పోవాలంటే ఏం చేయాలి?

ఒకప్పుడు కుంకుమను ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్లు. ఇప్పుడు రకరకాల రసాయనాలున్న కుంకుమను వాడటం వల్ల దద్దుర్లు, దురద వస్తున్నాయి. ఆ తర్వాత అక్కడ తెల్ల/ గోధుమరంగు మచ్చ ఏర్పడుతుంది. కొందరికి నుదుటి మీద రక్తం కూడా వస్తుంది. బ్రాండెడ్‌ కుంకుమ, తిలకం, స్టిక్కర్లు వాడినా మచ్చ పడే అవకాశం లేకపోలేదు. అందులో ఏయే పదార్థాలు వాడారో ఎవరికీ తెలియదు. ఇలాంటివి వాడటం వల్ల సాధారణంగా బొబ్బలు, దద్దుర్లు, దురద వచ్చే ప్రమాదం ఉంది. కుంకుమ తయారీలో లెడ్‌, మెర్క్యురీ వంటి రసాయనాల వాడకం వల్ల అలెర్జీ రావడానికి అవకాశం ఉంది. తిలకం ధరించిన చోట ఏమైనా తేడాగా అనిపిస్తే.. కుంకుమ లేదా స్కిక్కర్ల పెట్టుకోవడం వెంటనే ఆపేయాలి. తర్వాత ఈ సూచనలు పాటించి చూడండి..
* ముందుగా నాసిరకం స్టిక్కర్ల వాడకం మానేయాలి. బీవ్యాక్స్‌ని కొద్దిగా ఎసెన్షియల్‌ ఆయిల్‌తో కలిపి దాని మీద స్టిక్కర్‌ పెట్టుకోవాలి. టాపికల్‌ స్టిరాయిడ్‌ క్రీమ్‌ను రాసుకోవాలి. దీనివల్ల దురదలు, మచ్చ తగ్గుతాయి. కొన్ని రోజులపాటు స్టిక్కర్లు ఏమీ పెట్టుకోకుండా ఈ క్రీమ్‌లు, మాయిశ్చరైజర్‌ మాత్రమే రాస్తే ఫలితం ఉంటుంది.
* చర్మం బాగా సున్నితంగా ఉన్నవాళ్లకి మాత్రమే ఇలా జరుగుతుంది. వీళ్లు ఇంట్లో ఉన్నంతసేపూ స్టిక్కర్లు పెట్టుకోకుండా ఉండాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా పెట్టుకోవాల్సి వస్తే… ఆయిల్‌ లేదా క్రీమ్‌ రాసుకుని స్టిక్కర్‌ పెట్టుకోవాలి.
* మాయిశ్చరైజర్‌లో కొంచెం హైడ్రోకార్టిసొమ్‌ క్రీమ్‌ను కలిపి రోజుకు రెండుసార్లు రాస్తే మచ్చ తగ్గే అవకాశం ఉంది.