WorldWonders

100 యోగాసనాల రికార్డు

100 యోగాసనాల రికార్డు

దుబాయిలో భారత సంతతికి చెందిన బాలిక సమృతి కాలియా(11) యోగాసనాల్లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. గురువారం బుర్జ్‌ ఖలీఫా వద్ద జరిగిన కార్యక్రమంలో ‘పరిమిత స్థలం’లో కొన్ని నిమిషాల్లోనే 100 యోగాసనాలు చేసి గోల్డ్‌ వరల్డ్‌ రికార్డు నెలకొల్పింది. ఆమెకు ఇది మూడో ప్రపంచ రికార్డు కావడంతోపాటు నెలలోపే రెండవది. ఇంతకుముందు అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్‌ 21) నాడు ఒక నిమిషంలో 40 యోగాసనాలు వేసి ఆ రికార్డు నెలకొల్పారు. ‘కష్టపడే తత్వం, పట్టుదల’ ఈ విజయానికి కారణమని ఆమె చెప్పారు. ‘మనకు ధైర్య సాహసాలుంటే అన్ని మన కలలు సాకారం చేసుకోవచ్చు. నిశ్శబ్ధంగా కష్టపడి పని చేస్తే విజయం మీ సొంతమవుతుంది. అదే నాకు గొప్ప సొత్తు. నా మనోబలం’ అని సమృతి కాలియా తెలిపారు.