?హాస్యానికి అసలు చిరునామా శ్రీలక్ష్మి? ఆమె జన్మదిన సందర్భంగా?
నేను కవిని కానన్నవాణ్ని కత్తితో పొడుస్తా, నేను రచయిత్రిని కానన్నవాణ్ని రాయెత్తి కొడతా…
ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది?
ఎర్రగా ఉంటే బాగుండదు కనుక…
రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది?
నీలంగా ఉంటే బాగుండదు కనుక…
మల్లె తెల్లగా ఎందుకుంటుంది?
నల్లగా ఉంటే బాగుండదు కనుక…
శ్రీ లక్ష్మి చెప్పిన ఒకానొక హాస్య కవిత ఇది. ఓ వారపత్రిక సంపాదకుడు దగ్గరికి వెళ్లి అలవోకగా తను కవిత చదివేస్తుంటే.. థియేటర్స్ లో ఉన్న ప్రేక్షకులంతా కుర్చీల్లోంచి లేచి పడి పడి నవ్వాల్సిందే. తెలుగులో హాస్య నటీమణుల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. అంత తక్కువ మందిలోనూ తన మార్క్ హాస్యంతో చెదరని ముద్ర వేసిన శ్రీలక్ష్మి పుట్టిన రోజు జులై 20.