లాక్‌డౌన్‌లో శ్రుతీ హాసన్ ఓ రోజు చిత్రీకరణ చేశారు. అదీ ఐదారు గంటలు మాత్రమే! అయితే… వ్యక్తిగత మేకప్‌మెన్, హెయిర్ డ్రస్సర్‌కు పిలుపు అందలేదు. స్వయంగా శ్రుతీయే మేకప్ వేసుకున్నారు. హెయిర్ స్టయిలింగ్ చూసుకున్నారు. సుహాసినీ మణిరత్నం కోసం ఆమె కొంచెం కష్టమైనా… పనులన్నీ ఇష్టంగా చేసుకున్నారు. ఎందుకో తెలుసా? శ్రుతీ హాసన్‌కి సుహాసిని కజిన్ కదా! ఆమె అడిగే సరికి కాదనలేకపోయారు. లాక్‌డౌన్‌లో 20 నిమిషాల నిడివి గల లఘు చిత్రాన్ని సుహాసిని తెరకెక్కించారు. దాని టైటిల్ ‘చిన్నంజిరు కిళియె’. అందులో శ్రుతీ హాసన్ నటించారు. అయుతే… ఆమెది అతిథి పాత్రే. హాఫ్ డేలో చిత్రీకరణ పూర్తి చేసుకుని సెట్ లోంచి వెళ్లిపోయారని తెలిసింది. లాక్‌డౌన్‌లో ప్రభుత్వ నియమ నిబంధనలు అన్నీ పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకుని ఎనిమిది మంది బృందంతో సుహాసిని చిత్రీకరణ పూర్తి చేశారట. సెట్‌ను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ… చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. సినిమాలకు వస్తే… తెలుగులో రవితేజ ‘క్రాక్’, పవన్‌కల్యాణ్ ‘వకీల్‌సాబ్’లో శ్రుతీ హాసన్ నటిస్తున్నారు. ఆమె నటించిన హిందీ చిత్రం ‘యారా’ ఈ నెల 30న ‘జీ 5’ ఓటీటీలో డైరెక్టుగా విడుదలవుతోంది.
హాసన్ కోసం హాసన్…
Related tags :