తెలంగాణ అస్సోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వరయంలో బోనాల పండగ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిన సిధారెడ్డి, తెలంగాణ సమాచార హక్కు చట్టం కమీషనర్ కట్టా శేఖరరెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ , టాక్ కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు.టాక్ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం ఘనంగా బోనాల జాతరను, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపుతో మన సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటిచెప్పేలా వైభవంగా నిర్వహించుకుంటామని, కానీ నేటి ప్రస్తుత కరోనా – కోవిడ్ పరిస్థితుల్లో మేమంతా సంబరాలకు దూరంగా ఉంటూ సంస్థగా సమాజానికి వీలైనంత సేవ చేస్తున్నామని.వీడియో కాన్ఫరెన్సు కి ముందు బోనాల సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రజలంతా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకున్నామని, నేడు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న విషయం మనందరికీ తెలుసునని, టాక్ కార్యవర్గ సభ్యులు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ స్థానిక గుడి లో అమ్మవారికి బోనాలను సమర్పించి అందరినీ చల్లగా చూడాలని, కరోనా నుండి ప్రజలని రక్షించాలని కోరుకున్నామని కార్యదర్శి శుష్మణ రెడ్డి తెలిపారు. ప్రభుత్వాలుగా ఎన్ని నిబంధనలు చర్యలు తీసుకున్నా, ప్రజలుగా మనమందరం స్వీయ క్రమశిక్షణ పాటించాలని టాక్ సంస్థ నుండి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామని శుష్మణ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొని బోనాలు సమర్పించిన ప్రతి టాక్ సంస్థ ఆడబిడ్డలందరికీ కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ నాయకులు అనిల్ కూర్మాచలం, పవిత్ర కంది సంస్థ చేస్తున్న కార్యక్రమాల గురించి వీడియో కాన్ఫరెన్సు లో పాల్గొన్న అతిధులకు వివరించారు, అలాగే కార్యవర్గ కుటుంబ సభ్యుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకొన్నారు.ముఖ్య అతిధులుగా హాజరైన తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలంగాణ సమాచార హక్కు చట్టం కమీషనర్ కట్టా శేఖరరెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ టాక్ సంస్థ తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు ఖండాంతరాల్లో చేస్తున్న కృషిని అభినందించారు. బోనాల పండగ ప్రత్యేకత గురించి, తెలంగాణ సంస్కృతి పరిరక్షణకై ప్రభుత్వం చేస్తున్న కృషి, ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాల గురించి నందిని సిద్ధారెడ్డి, కట్టా శేఖర్ రెడ్డి మరియు మామిడి హరికృష్ణ టాక్ సభ్యులకు వివరించారు.టాక్ సంస్థకు తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తుందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు.ప్రతి సంవత్సరం బోనాల పండగ నాడు బోనం సమర్పించి తొట్టెల ఊరేగింపు, అమ్మ వారి పూజ మనకు ముఖ్య ఘట్టాలని కరోనా నిబంధనల నేపధ్యంలో సామూహికంగా పూజా కార్యక్రమం నిరవహించే అవకాశం లేనందున ,నేడు టాక్ తరపున ముఖ్య నాయకులు మల్లా రెడ్డి – శుష్మణ దంపతులు వారి ఇంట్లో సంప్రదాయబద్దంగా అమ్మ వారి పూజ నిర్వహించి ప్రజలంతా సంతోషంగా ఉండాలని, ముఖ్యంగా కరోనా మహమ్మారి నుండి అందరినీ కాపాడాలని భక్తి శ్రద్దలతో పూజ చేయడం జరిగిందని తెలిపారు..టాక్ సంస్థ నుండి మల్లా రెడ్డి – శుష్మణ దంపతులకు కృతఙ్ఞతలు తెలియజేసారు.తెలంగాణ బోనాల పాటలతో ప్రముఖ గాయని స్వాతి రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వారిని అలరించడమే కాకుండా, పండగ వాతావరణాన్ని తెచ్చారు.గత ఏడాది ప్రత్యేకంగా అమెరికా నుండి వచ్చి పోతరాజు వేషధారణతో లండన్ వీధుల్లో ధూమ్ ధామ్ చేసిన జయ్ కూడా వీడియో కాన్ఫరెన్ లో పోతరాజు వేషధారణతో అమెరికా నుండి పాల్గొని బోనాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పరిపూర్ణతను తెచ్చారు.చివరిగా టాక్ సభ్యులంతా ప్రజలు స్వీయ నియంత్రణతో పాటు ప్రభుత్వ నిబంధనలుపాటించాలని కోరారు, అలాగే అమ్మవారు ప్రజలందరినీ రక్షించాలని ప్రార్థించారు.
టాక్ లండన్ బోనాల్లో కరోనా నివారణ పుజలు
Related tags :