ఎల్లుండి మంత్రివర్గ విస్తరణ… ముహూర్తం ఖరారు చేసిన సీఎం జగన్. అదే రోజు కొత్త మంత్రుల పదవీప్రమాణం? ఏపీలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22న ఏపీ క్యాబినెట్ విస్తరణ కోసం సమావేశమవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. అదే రోజున ఇద్దరు కొత్త మంత్రుల పదవీప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని తెలుస్తోంది.. రాజ్యసభకు వెళుతున్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రి పదవుల నుంచి తప్పుకున్నందున వారి స్థానంలో సీదిరి అప్పలరాజు (పలాస ఎమ్మెల్యే), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (రామచంద్రాపురం ఎమ్మెల్యే)లకు క్యాబినెట్ బెర్తులు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
బుధవారం జగన్ నూతన మంత్రివర్గం

Related tags :