ఖరీదైన పట్టు చీరను అల్మారాలో భద్రపరిచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనసుకు నచ్చిన చీరను ఏళ్ల తరబడి పదిలంగా కాపాడుకోవచ్చు. అదెలాగంటే…
ఒకసారి వాడిన చీరను రెండు మూడు గంటలసేపు నీడలో గాలి తగిలేలా ఆరేయాలి. ఆ తరువాత పైట చెంగు లోపలివైపు వచ్చేలా మడతపెట్టాలి. పైటంచు భాగం లోపలివైపు ఉంటే మంచిది. పొడిగా ఉండే తెల్లటి కాటన్ లేదా మస్లిన్ వస్త్రంలో చుట్టి బీరువాలో పెట్టాలి.
* పట్టుచీరలను మూడు నెలలకోసారి బయటకు తీసి కాసేపు నీడపట్టున ఆరేయాలి. ఆ తరువాత గతంలో వేసిన మడతను మార్చాలి. ఒకే మడతలో ఎక్కువ రోజులుంటే పోగులు తెగిపోవచ్చు.
* వీటిని డ్రైక్లీనింగ్‌కు ఇవ్వాలి. చీర మీద కాఫీ, టీ మరకలు పడితే అక్కడ రెండు చుక్కలు షాంపూ వేసి చన్నీటితో శుభ్రం చేయాలి.
* పట్టుచీరలను హ్యాంగర్‌లకూ తగిలించొచ్చు. కానీ హ్యాంగర్‌కు ఒక్క చీరే ఉండాలి. వేరే హ్యాంగర్లకు మధ్య దూరం ఉండేలా చూసుకోవాలి. స్టీలు/ ఇనుప హ్యాంగర్ల వల్ల చీరలపై మెటల్ మరకలు పడే ప్రమాదముంది కాబట్టి చెక్క హ్యాంగర్లనే వాడాలి.
* నాఫ్తలిన్ ఉండలను వేసి మూటకట్టి చీరల మధ్య పెడితే పురుగుల బెడద ఉండదు. మంచి పరిమళమూ వస్తుంది. అలాగే ఎండు వేపాకులను మూటకట్టి చీరల అడుగున పెట్టాలి. దీనివల్ల చిన్నచిన్న పురుగులు దరిచేరకుండా పట్టుచీరలకు చిల్లులు పడకుండా ఉంటాయి.
ఒక కొక్కేనికి ఒకటే పట్టుచీర ఉండాలి
Related tags :