Movies

పుకార్లు పుట్టించకండి

పుకార్లు పుట్టించకండి

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్ బచ్చన్‌కు కరోనా నెగిటివ్‌ వచ్చిందన్న వార్తను ఆయన ఖండించారు. ఇంకా తాను ముంబైలోని నానావతి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు ట్విటర్‌లో తెలిపారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న బిగ్‌బీ, తాజా టెస్ట్‌ రిపోర్ట్‌లో నెగిటివ్ వచ్చినట్లు మీడియాలో వైరల్‌ అయింది. ‌ఇటువంటి వార్తలు ప్రసారం చేయడం మీడియాకు తగదని హితవు పలికారు. ఇంకా తాను కరోనా పాజిటివ్‌తో బాధపడుతున్నట్లు అమితాబ్ బచ్చన్‌ స్పష్టం చేశారు. మీడియాలో ప్రసారమవుతున్న వార్తలో ఎలాంటి నిజం లేదని, బాధ్యతారాహిత్యంగా వార్తను ప్రసారం చేయడం సరికాదని ఆయన మీడియాకు సూచించారు. అయితే తమ నటుడు కరోనా నుంచి కోలుకొని ఆయన ఆరోగ్యం కుదటపడాలని అభిమానులు పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు.