వర్షాకాలం మొదలైనప్పటి నుంచి ప్రతిరోజూ సాయంత్రం మేఘాలు కరిగి చిరుజల్లు పడుతున్నది.. ఆ సమయంలో మొక్కజొన్నను వేడి వేడిగా కాల్చుకొని తింటుంటే ఆ మజానే వేరు. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ మొక్కజొన్నలో పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఒకసారి తెలుసుకుంటే మొక్కజొన్నకు మరింత ప్రియారిటీ ఇవ్వొచ్చు!
* మొక్కజొన్నలో కావాల్సినన్నీ మినరల్స్ ఉంటాయి.
* మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్‌లు అధికంగా ఉంటాయి. దీనివల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.
* పేగు క్యాన్సర్‌తో బాధపడేవారికి మొక్కజొన్న అరికడుతుంది.
* మలబద్దకం, మొలలు వంటి వ్యాధులను దరిచేరకుండా ఉంచేందుకు మొక్కజొన్నలోని ఫైబర్ ఎంతో ఉపయోగపడుతుంది.
* జీర్ణక్రియ సాఫీగా జరిగిందుకు మొక్కజొన్న తోడ్పడుతుంది.
* ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.
* ప్రతిరోజూ మొక్కజొన్న తినేవారిలో హెయిర్ ఫోలీ సెల్స్ బలంగా ఉంటాయట.
* శిరోజాలు ఆకర్షణీయంగా కనిపించడానికి మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్ సహాయపడుతుంది.
* మొక్కజొన్న గింజలు ఎండిన తర్వాత, వాటి నుంచి తీసిన నూనెను చర్మానికి రాసుకుంటే నిగనిగలాడుతుంది.
* చెడు కొలెస్ట్రాల్ నుంచి గుండెను మొక్కజొన్న ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటుంది.
* ఇది రక్తప్రసరణను మెరుగుపరిచేందుకు కూడా ఉపయోగపడుతుంది.
* అన్నింటికన్నా ముఖ్యంగా ఈ రోజుల్లో మధుమేహంతో బాధ పడేవారే ఎక్కువగా ఉన్నారు. అలాంటి వారికి మొక్కజొన్న ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఎలాంటి అభ్యంతరం లేకుండా దీన్ని తినొచ్చు.
* కిడ్నీలతో బాధపడేవారు మొక్కజొన్న తింటే సమస్య పరిష్కారమవుతుంది.