Business

శ్రావణమాసం కిక్కుతో మిడిసిపడుతున్న బంగారం వెండి

శ్రావణమాసం కిక్కుతో మిడిసిపడుతున్న బంగారం వెండి

శ్రావణమాసం పుణ్యమాని… రూ. 52 వేలు దాటేసిన 10 గ్రాముల బంగారం ధర! శుభకార్యాలు అధికంగా జరిగే శ్రావణమాసం మొదలైపోయింది. వివాహాలు జరుగుతూ ఉండటంతో బంగారం కొనుగోళ్లు జోరందుకోగా, ధర మరో ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. నిన్న హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర రూ. 52,400గా నమోదైంది. దేశంలో పసిడికి గిరాకీ పెరగడంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు కూడా ప్రభావం చూపుతున్నాయని బులియన్ నిపుణులు వ్యాఖ్యానించారు. ఇక దేశ రాజధానిలో బంగారం ధర రూ. 51,443కు చేరుకోగా, ముంబైలో రూ. 50,703గా నమోదైంది. ఇక, వెండి ధర సైతం బంగారంతో సమానంగా పరుగులు పెడుతోంది. కిలో వెండి ధర రూ. 62,760 వద్ద కొనసాగుతోంది.

బంగారం ధర భగభగమంటోంది. వెండి దూసుకెళ్తోంది. బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ఇప్పుడు గోల్డ్, వెండి కొనాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.3050 పెరిగింది. దీంతో ధర రూ.62,000కు ఎగసింది. వెండి సరఫరా తగ్గడం సహా పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.17 శాతం దిగొచ్చింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1886 డాలర్లకు తగ్గింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.67 శాతం తగ్గుదలతో 23.84 డాలర్లకు క్షీణించింది.దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పైకి కదిలింది. రూ.49,00కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.250 పెరుగుదలతో రూ.50,200కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర ఏకంగా రూ.3050 పెరుగుదలతో. రూ.62,000కు చేరింది.

##################

పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగానే కొనసాగుతూ వచ్చాయి. దీంతో ఈరోజు కూడా దేశీ ఇంధన ధరలు స్థిరంగానే ఉన్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. హైదరాబాద్‌‌లో శుక్రవారం లీటరు పెట్రోల్ ధర రూ.83.49 వద్ద నిలకడగానే ఉంది. డీజిల్ ధర కూడా రూ.79.85 వద్ద స్థిరంగా కొనసాగింది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.83.96 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్‌ ధర రూ.80.01 వద్ద నిలకడగా కొనసాగుతోంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర స్థిరంగా రూ.83.43 వద్దనే ఉంది. డీజిల్ ధర రూ.79.73 వద్ద నిలకడగా కొనసాగుతోంది.