DailyDose

CRDA ఎందుకు రద్దు చేశారు…జగన్‌కు మోడీ ప్రశ్న-తాజావార్తలు

CRDA ఎందుకు రద్దు చేశారు…జగన్‌కు మోడీ ప్రశ్న-తాజావార్తలు

* టీడీపీ రాష్ట్ర కార్యాలయ స్థలం స్వాధీనం చేసుకోవాలని దాఖలైన పిల్ కొట్టివేత అళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిల్ కొట్టివేసిన హైకోర్టు ద్విసభ్య బెంచ్…3.65 ఎకరాల భూమి వాగు పోరంబోకు అని పిటిషన్‍లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి…భూ కేటాయింపు జీవో 228 రద్దు చేయాలని పిటిషన్‍లో వెల్లడి…గతంలోనే దీనిపై రిట్ పిటిషన్ దాఖలైనందుల పిల్ అవసరం లేదన్న హైకోర్టు…పిల్ వేయడంలో రామకృష్ణారెడ్డి ఆసక్తి ఏమిటని ప్రశ్నించిన హైకోర్టు.

* రాజధాని మార్పు, సీఆర్‌డీఏ బిల్లుల రద్దు వ్యవహారంపై వివరాలు కోరిన ప్రధానమంత్రి కార్యాలయం. హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖపై స్పందించిన పీఎంఓ. గవర్నర్‌ ఆమోదానికి ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పీఎంఓకు పంపిన ప్రొ.జి.వి.ఆర్‌.శాస్త్రి.

* చైనాతో విభేదాలు తారస్థాయికి చేరుకున్న వేళ అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నమ్మకం చూరగొన్న భారత్‌కు చైనా నుంచి తరలిపోతున్న అంతర్జాతీయ స్థాయి కంపెనీలను ఆకర్షించగల సత్తా ఉందని పేర్కొన్నారు. అదే విధంగా వాణిజ్య అవసరాల కోసం భారత్‌ డ్రాగన్‌ కంపెనీలపై ఆధారపడటం తగ్గించుకోవాలని.. అప్పుడే చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ సృష్టిస్తున్న అవాంతరాలను సులభంగా అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు.

* తమిళనాడులో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకీ ఉద్ధృతమవుతోంది. తాజాగా రాష్ట్ర గవర్నర్‌ కార్యాలయం రాజ్‌భవన్‌లో మొత్తం 84మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రాజ్‌భవన్‌లో కొందరికి వైరస్‌ లక్షణాలు కనిపించడంతో మొత్తం 147 మంది కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 84మందిలో వైరస్‌ బయటపడినట్లు రాజ్‌భవన్‌ ప్రకటించింది. అయితే కరోనా సోకినవారందరూ భవనం బయట విధులు నిర్వర్తించేవారేనని తెలిపింది. ప్రస్తుతం వైరస్‌ సోకిన వారందరూ క్వారంటైన్‌లో ఉన్నారని, వీరు గవర్నర్‌తో, సీనియర్‌ అధికారులతో కలవలేదని గవర్నర్‌ కార్యాలయం స్పష్టంచేసింది. వైరస్‌ సోకిన వారిలో ఎక్కువగా భద్రతా సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఉన్నట్లు పేర్కొంది. ముందుజాగ్రత్త చర్యగా రాజ్‌భవన్‌ కార్యాలయం ప్రాంగణంలో శానిటైజ్‌ పనులు చేపట్టారు.

* రాజస్థాన్‌ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. సచిన్‌ పైలట్‌ వర్గంపై ఈ నెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ రాజస్థాన్‌ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ స్పీకర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, రాజస్థాన్ హైకోర్టులో విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో సచిన్‌ పైలట్‌ వర్గానికి మరోసారి ఊరట లభించింది. రేపు సచిన్ పైలెట్ వర్గం పిటిషన్‌పై రాజస్థాన్‌ హైకోర్టు తీర్పు వెలువరించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, హైకోర్టు ఆదేశాల అమలు మాత్రం సుప్రీంకోర్టులో వచ్చే ఫలితంపైనే ఆధారపడి ఉండాలని జస్టిస్ అరుణ్ మిశ్రా వెల్లడించారు. అంతేకాకుండా సుప్రీంకోర్టులో స్పీకర్ లేవనెత్తిన అంశాలపై సుదీర్ఘ విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది.

* తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ వ్యక్తికి శిరోముండనం చేసి జాతి ఆత్మగౌరవంపై దెబ్బకొట్టారని మాజీ ఎంపీ హర్షమార్‌ మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో బాలికపై సామూహిక అత్యాచారం చేసి, నిందితులు బాలికను పోలీస్‌స్టేషన్‌ వద్ద వదిలేశారని, అక్కడ బాలికను పోలీసులు కొట్టారని ఆరోపించారు. ఆ విషయాన్ని ఎఫ్‌ఐఆర్‌ నుంచి తొలగించి.. ముష్టి వేసినట్లు బాలిక కుటుంబానికి ఆర్థిక సాయం చేశారన్నారు.

* కర్నూలు జిల్లాలో కరోనా బాధితులను అంబులెన్స్‌లో తరలించిన ఘటన మరువక ముందే, మరో ఘటన వెలుగు చూసిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. విశాఖలో కరోనా రోగులను ఆర్టీసీ బస్సులో కుక్కి పంపారని ఆయన అన్నారు. ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.ఏపీలో ఆరోగ్య విపత్తు తలెత్తే ప్రమాదముందని చెప్పడానికి ఇదో హెచ్చరిక అని, ఈ వీడియోను చూసి విస్తుపోవాల్సిందే అంటూ తన ట్విటర్‌లో పోస్టు చేశారు.