Health

చుండ్రుపై పోరాడే పసుపు

చుండ్రుపై పోరాడే పసుపు

ప‌సిపిల్ల‌ల‌కు చ‌ర్మంపై ఉన్న అవాంఛిత రోమాల‌ను తొలిగించేందుకు ప‌సుపు వాడుతారు. ఇది ఆరోగ్యానికి మేలు చేయ‌డంతోపాటు అందాన్ని రెట్టింపు చేస్తుంది. మ‌రి రోమాల‌ను తొల‌గించేందుకు వాడే ప‌సుపుతో జుట్టును ఎలా స్ట్రాంగ్‌గా మార్చుకోవ‌చ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదేంటీ? జుట్టు తొలిగించేందుకు ప‌సుపు, పెరిగేందుకు ప‌సుపు అని రెండూ మీరే చెబుతున్నారు అనుకుంటారేమో. ఇది నిజం. కాక‌పోతే డైరెక్ట్‌గా ప‌సుపును శిరోజాల‌కు అప్లై చేయ‌కూడ‌దు. దీనికో ప‌ద్ద‌తి ఉంది. అదెలాగో తెలుసుకోండి.

* త‌ల మీద ప‌సుపు రాసుకోవ‌డం వ‌ల్ల చుండ్రు తొలిగిపోతుంది. ప‌సుపు యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ల్ఫ‌మేట‌రీ గుణాల‌ను క‌లిగి ఉండ‌టంతో చుండ్రును నివారిస్తుంది.

* చుండ్రును పార‌దోలాలంటే.. కొన్ని చుక్క‌ల ఆలివ్ ఆయిల్‌ను తీసుకొని కొద్దిగా ప‌సుపు క‌లిపి పేస్ట్‌లా త‌యారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మొదుళ్ల‌కు అంటేలా రాసుకోవాలి. గంట త‌ర్వాత త‌ల‌స్నానం చేస్తే చుండ్రు తొలిగిపోవ‌డంతోపాటు త‌ల‌పై ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌ను పెంచుతుంది.

* వాడే షాంపూకు కాస్త ప‌సుపు క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మంతో హెయిర్ తిన్నింగ్ స‌మ‌స్య త‌గ్గుతుంది. అంతేకాకుండా శిరోజాలు ద‌ట్టంగా మారుతాయి. అలాగే జుట్టు రాలే స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. జుట్టు ప‌దిలంగా ఉండాలంటే స్కాల్ప్‌ను హెల్దీగా ఉంచుకోవాలి. పసుపు స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచి హెయిర్ గ్రోత్‌కు సపోర్ట్ చేస్తుంది.