ఇటీవలే మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ మలయాళ ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యారు. ఫైట్స్, డ్యాన్స్‌లతో అందర్నీ మెప్పించారు. ఇప్పుడు మోహన్‌లాల్ కుమార్తె విస్మయ కూడా సినిమాల్లోకి రాబోతున్నారని మలయాళ ఇండస్ట్రీ టాక్. అయితే విస్మయ పని చేయబోయేది ఆన్‌స్క్రీన్ కాదు… ఆఫ్‌స్క్రీన్. దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేయబోతున్నారు. ‘బారోజ్’ అనే చిత్రం ద్వారా మోహన్‌లాల్ తొలిసారి దర్శకుడిగా మారబోతున్నారు. ఈ సినిమాకు దర్శకత్వంలో తండ్రికి చేదోడుగా ఉంటారట విస్మయ. ఫ్యాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్ర పోషించనున్నారు లాల్. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రారంభం కావొచ్చని సమాచారం.
తండ్రికి తోడ్పాటు
Related tags :