శ్రావణమాసం అనగానే వ్రతాలే కాదు సెనగలూ గుర్తుకొస్తాయి. రోజుకో గుప్పెడు సెనగలను ఉడికించి తింటే శరీరానికి బోలెడన్ని పోషకాలు అందుతాయి.
* వీటిల్లో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్-కె ఉంటాయి. ఇవి ఎముకలు బలంగా ఉండటానికి తోడ్పడతాయి.
* వీటిలోని విటమిన్-బి9, ఫోలేట్ మెదడు, కండరాల అభివృద్ధికి తోడ్పడతాయి. నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.
* సెనగల్లో ఉండే ప్రొటీన్, పీచు అధిక బరువు నియంత్రణకు సాయపడతాయి.
* సెనగల్లోని పీచు పదార్థం రక్తంలోని చక్కెర, కొవ్వు స్థాయులను తగ్గిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
* ఉడికించిన సెనగలను అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్స్‌లా తీసుకోవచ్చు. మాంసాహారంతో కలిగే ప్రయోజనాలను సెనగలను తినడం ద్వారా పొందవచ్చు.
శ్రావణమాసంలో శనగల పాత్ర
Related tags :