Business

చిరువ్యాపారులను వేధించడం మానని పోలీసులు

చిరువ్యాపారులను వేధించడం మానని పోలీసులు

చిరు వ్యాపారులకు కరోనా కష్టాలు తెచ్చిపెట్టింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో చిరు వ్యాపారులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి.

కేవలం ప్రభుత్వం సూచించిన సమయంలోనే విక్రయాలు జరపడం లాంటి నిబంధనలు చూస్తూనే ఉన్నాం.

అయితే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ పట్టణంలో కుడి – ఎడమ పద్ధతిని అమలు చేస్తున్నారు. ఈ విధానంలో రోజు విడిచి రోజు విక్రయాలు జరుపుకోవాలి. 

ఈ క్రమంలో ఓ 14 ఏళ్ల బాలుడు తోపుడు బండిపై కోడిగుడ్ల వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

రోడ్డుపై నిలిపిన బండిని అక్కడ్నుంచి తీసుకెళ్లాలని అధికారులు ఆ అబ్బాయికి సూచించారు. లేదంటే రూ. 100 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

తోపుడు బండిని తీసేయను.. లంచం ఇవ్వను అని బాలుడు అధికారులకు చెప్పేశాడు.

దీంతో ఆగ్రహం చెందిన అధికారులు.. కోడిగుడ్ల బండిని తోసేశారు. గుడ్లన్నీ రోడ్డుపాలయ్యాయి. 

అధికారుల తీరుతో బాలుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అధికారులను బెదిరిస్తూ అబ్బాయి వీడియోలో కనిపించాడు.

ఈ ఘటనపై కాంగ్రెస్‌ నాయకులు మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం చిరు వ్యాపారులను ఇబ్బందికి గురి చేస్తుందన్నారు.

కుడి – ఎడమ పద్ధతిని తొలగించాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.