* బెజవాడలో భారీ దోపిడీ.విజయవాడ వన్ టౌన్ కాటూరి వారి వీధిలో గుర్తు తెలియని వ్యక్తుల దోపిడీ …7 కేజీల బంగారం,30 లక్షల నగదుతో పరారీ…షాపులో ఉన్న గుమస్తా కాళ్ళు చేతులు కట్టి వేసి నగదు దోపిడీ చేసిన నిందితులు.సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్న పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, క్లూస్ టీం సిబ్బంది. వన్ టౌన్ బంగారం షాప్ లో జరిగిన దోపిడీని చేదించిన పోలీసులు.అదే షాపులో గుమ్మస్తగా పని చేస్తున్న విక్రమ్ సింగ్ నిందితుడుగా గుర్తింపు.
* సెల్ఫీ పిచ్చితో ఓ ఇద్దరు యువతులు ఓ నది మధ్యలో ఉన్న రాళ్లపైకి వెళ్లారు. ఆ ఇద్దరు సెల్ఫీ తీసుకుంటుడగా నదికి వరద పోటెత్తింది. దీంతో ఇద్దరు వరదలోనే చిక్కుకుపోయారు.ఆ తర్వాత పోలీసులు వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు.ఈ ఘటన మద్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలోని బేలాఖేడి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.
* పులివెందులలో వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి మరోమారు హత్య జరిగిన ప్రదేశాన్ని చుట్టుపక్కల ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ పులివెందుల టౌన్ ప్లానింగ్ అధికారుల సహాయంతో ఇంటి మ్యాప్ తయారు చేస్తున్న సిబిఐ నిపుణుల బృందం.
* శ్రీకాకుళం మండలం పెద్దపాడు లోని స్థానిక ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు బంగ్లా ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు.
* బాబ్రీ మసీదు కేసులో లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట భాజపా సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ వాంగ్మూలం ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాంగ్మూలం ఇచ్చారు అడ్వాణీ.