కీర్తి సురేష్ అందం ముందు వెన్నెలైనా చిన్నబోవాల్సిందే. అంతటి అందగత్తెను కళాశాల చదివే రోజుల్లో ఎన్ని ప్రేమ లేఖలు వచ్చాయని అడిగితే ఇలా సమాధానం చెప్పుకొంటూ వచ్చింది. ‘ఓ సారి నగల దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లా. అక్కడ ఓ అభిమాని నా దగ్గరికి వచ్చి ఒక బహుమతి ఇచ్చి వెళ్లాడు. అందులో నా ఫొటోలన్నీ పెట్టి ఒక ఆల్బమ్‌లా తయారు చేశాడు. వాటితో పాటే ఒక ఉత్తరం ఉంది. ఏంటని చూస్తే అందులో అతడు నాకు ప్రపోజ్ చేశాడు. నేను దాన్ని చాలా భద్రంగా దాచుకున్నా. ఎందుకంటే నేను కాలేజీ చదివే రోజుల్లో నాకు ఒక్క ప్రేమలేఖ కూడా రాలేదు’ అని ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది. ‘గుడ్ లక్ సఖి’, ‘రంగ్‌దే’ సినిమాలతో త్వరలో అలరించనుంది కీర్తి.
చేతిలో పెట్టి వెళ్లిపోయాడు
Related tags :