Movies

అర్థం చేసుకోవాలి…అనుకరించకూడదు

అర్థం చేసుకోవాలి…అనుకరించకూడదు

‘‘బయోపిక్‌లో నటిస్తున్నప్పుడు.. ఆ వ్యక్తి జీవిత సారాంశాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. బయోపిక్‌లో చేస్తున్నాం కదా అని ఆ వ్యక్తిలా కనిపించడం కోసం హావభావాలను.. స్వరాన్ని అనుకరించకూడదు. మనం నేర్చుకోవాల్సిన అంశం ఇదే. ‘ది డర్టీ పిక్చర్’ తీస్తున్నప్పుడు నేను సిల్క్‌ స్మితలా కనిపించట్లేదని ఆ చిత్ర దర్శకుడు మిలాన్‌ లుత్రియానే చెప్పారు. అలాగే శకుంతల దేవిలా నేను కనిపించను. కాబట్టి వ్యక్తుల జీవిత సారాంశాన్ని మాత్రమే గ్రహించి నటించాలి’’అని విద్యా బాలన్‌ చెప్పుకొచ్చారు.