* ఏసీబీ కేసులో గూడూరు తహశీల్ధార్ షేక్ హసీనా ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.గత ఏడాది నవంబర్ 7నసినీ ఫక్కీలో హసీనాను ట్రాప్ చేసిన ఏసీబీ అధికారులు. 4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన గూడూరు తహశీల్ధార్ హసీనబీ పరిచయస్థుడు మహబూబ్ ఆలి. అప్పటి నుంచి పరారీలో ఉన్న తసీల్ధార్ హసీనబీ. ఆన్ లైన్ లో భూమి క్లియర్ చేసేందుకు సురేష్ అనే వ్యక్తిని 8 లక్షలు డిమాండ్ చేసిన హసీనా బీ. 4 లక్షలు మొదట ఇచ్చేందుకు ఒప్పందం.4 లక్షలు పాణ్యం బస్ స్టాండ్ లో మహబూబ్ అనే వ్యక్తికి ఇవ్వాలని చెప్పిన తహసీల్ధార్ఫోన్ లో మహబూబ్,సురేష్ తో మాట్లాడి డబ్బులు ఇప్పించిన హసీనా బీ. ఏసీబీ అధికారులకు దొరకకుండా ముప్పు తిప్పలు పెట్టి పరారీలో ఉన్న హసీనా బీ.
* చింతూరు డివిజన్ డొంకరయి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత.44 లక్షల 10 వేలు విలువ గల 1470 కేజీ ల గంజాయి సీజ్.కంటైనర్ సీజ్ 4 గురు నిందితుల అరెస్ట్ . ఇద్దరు స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు డొంకరాయి పోలీసులు.కంటైనర్ లారీ మరియుద్వీచెక్రవాహనం పోలీసులు అధీనంలోకి తిసుకున్నారు
* బ్రహ్మసముద్రం మండలంలోని గొంచిరెడ్డిపల్లి గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో వెండి చోరీకి గురైంది.గొంచిరెడ్డిపల్లి గ్రామ శివారులో బ్రహ్మసముద్రం వెళ్లే ప్రధాన రహదారి పక్కన పాత నరసింహ స్వామి దేవాలయంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు స్వామివారి మూల విరాట్ దగ్గర ఉంచిన దాదాపు రెండున్నర నుంచి మూడు కేజీల వెండి సామగ్రిని అపహరించినట్టు గ్రామస్తులు తెలిపారు.
* జిల్లాలోని సీతానగరంలో దళిత యువకుడిని శిరోముండనం చేసిన కేసులో స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ అప్పారావును సస్పెండ్ చేశారు.ఇసుక రవాణా చేస్తున్న కొందరు గ్రామంలో లారీలను అతివేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారకులు అవుతున్నారని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన దళిత యువకులు లారీలను ఆపారు.ఈ విషయం తెలుసుకున్న అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు అక్కడికి చేరుకుని దళిత యువకులతో వాగ్వాదానికి దిగారు.అనంతరం సదరు నాయకుడు పోలీస్‌స్టేషన్‌లో దళిత యువకులపై ఫిర్యాదు చేశారు.పోలీసులు సంఘట స్థలానికి చేరుకుని దళిత యువకుడు ప్రసాద్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాది అతడికి శిరోముండనం చేసి పంపించి వేశారు.
* మచిలీపట్నంలో ఖైనీ, గుట్కా ప్యాకేట్ల భారీ డంపు స్వాధీనం చేసుకున్న పోలీసులు …మచిలీపట్నం ఆర్.పేట పోలీసు స్టేషనుకు సమీపంలో భారీ డంప్ స్వాదీనం చేసుకున్న పోలీసులు …సుమారు 20 లక్షలు డంపు స్వాధీనం …పోలీసుల అదుపులో నిందితుడు లెనిన్…గత కొంత కాలం క్రితం నిషేదిత గుట్కాలు , ఖైనీలు వ్యాపారం చేస్తున్నాడని గెల్లి కిషోర్ అనే వ్యక్తికి నగర బహిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ గారు…గుట్కా, ఖైనీ వ్యాపారిని భైస్కరణ చేసినా భయం లేకుండా లెనిన్ యధావిధిగా గుట్కా, ఖైనీ లు అమ్మకం చేస్తున్నాడు అని గ్రహించి జిల్లా SP శ్రీ రవీంద్రనాథ్ బాబు IPS., గారు పూర్తి మెగా ను ఏర్పరిచి సిబ్బంది పర్యవేక్షణలో పెట్టి భారీ డంపు స్వాధీనం చేసుకోవడం జరిగింది.