DailyDose

సీఎంకు కరోనా.హైదరాబాద్‌లో కరోనాబాబా-TNI బులెటిన్

సీఎంకు కరోనా.హైదరాబాద్‌లో కరోనాబాబా-TNI బులెటిన్

* హైదరాబాద్ హఫీజ్ పేట్ హనీఫ్ కాలనీలో కరోనబాబా..మాయలు, మంత్రాలతో కరోనను నయం చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న కరోనబాబా అలియాస్ ఇస్మాయిల్ బాబా..హహీజ్ పేట్ హనీఫ్ కాలనీలోని కరోనబాబా స్థావరంపై పోలీసుల దాడులు..ఒక్కో కరోన రోగి నుంచి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వసూళ్లు..మంత్రాలు, నిమ్మకాయలు, విభూతితో పూజలు చేసి అమాయకులను నమ్మించి మోసాలు..గత మార్చి నుంచి కరోనబాబా దందాలు..కరోనబాబాకు అతీతమైన శక్తులు ఉన్నాయంటూ శిష్యులచే ప్రచారంమాస్క్ పెట్టుకోనక్కర్లేదు.. అపూర్వ శక్తులతో కరోన బారి నుంచి కాపాడతనంటూ నమ్మబలికిన కరోనాబాబా..జలుబు, దగ్గు ఉన్నా..అది కరోననే అంటూ అమాయకులైన జనాన్ని భయపెట్టి వేలాది రూపాయలు వసూళ్లు..70 మంది బాధితులు కరోనా బాబా చేతిలో మోసపోయినట్టు గుర్తింపు..కరోన సోకినట్టైతే ఆసుపత్రికి వెళ్లాలని అక్కడున్న జనాన్ని పంపించిన పోలీసులు..మోసాలకు పాల్పడే బురిడీ కరోనబాబాను నమ్మొద్దఒటున్న పోలీసులు.

* మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్​కు కరోనా పాజిటివ్మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు కరోనా వైరస్‌ సోకింది.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.కరోనా లక్షణాలు కనిపించటం వల్ల పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని వచ్చినట్లు పేర్కొన్నారు.తనను కలిసిన వారంతా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సూచించారు.తనకు అత్యంత సమీపంలో ఉండే వారు క్వారంటైన్‌లో ఉండాలన్నారు.సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్… ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. అంబులెన్స్​లో ఆసుపత్రికి చేరుకున్నారు.

* కరోనా లక్షణాలున్న వ్యక్తులను తిరిగి పంపితే ఆ హాస్పిటల్ యాజమాన్యంపై చర్య తీసుకుంటాము హోంమంత్రి సుచరిత హెచ్చరికఅమరావతి: కరోనా లక్షణాలున్న వ్యక్తులను తిరిగి పంపితే ఆ హాస్పిటల్ యాజమాన్యంపై చర్య తీసుకుంటామని హోంమంత్రి సుచరిత ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు.కరోనా భాదితుల పట్ల నిర్లక్షంగా వ్యవహరించినా కూడా సంబంధిత ఆసుపత్రుల గుర్తింపును రద్దు చేస్తామన్నారుకరోనా లక్షణాలు ఉన్న పేషెంట్‌ను ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్ళిన సమయంలో వారిని తిరిగి వెనక్కి పంపితే ఆయా హస్పిటల్ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకుంటాం.నిబంధనలను ఉల్లంఘించినా, కరోనా భాదితుల పట్ల నిర్లక్షంగా వ్యవహరించినా సంబంధిత ఆసుపత్రుల గుర్తింపును రద్దు చేస్తాం, హాస్పిటల్ సిబ్బంది భయపడకుండా సేవలందించాలని కోరుతున్నాం’’ అని సుచరిత ట్వీట్‌లో పేర్కొన్నారు. 

* ఖమ్మం వరంగల్ కరీంనగర్ నిజమాబాద్ మహబుబ్ నగర్ జిల్లా కేంద్రాలలో కరోనా కేసులు చాలా డేంజర్ స్థాయిలో ఉన్నాయి. ఖమ్మం జిల్లా లో పలువురు పోలీసులకి డాక్టర్లకి ఓ యంపిడివో కి సైతం కరోనా సోకింది.ఖమ్మం నగరంలో నిన్ననే ఇద్దరు కరోనా తో మృత్యువాత పడ్డారు.నిన్న 40 పైగా కేసులు నమోదైనాయి.ఇవ్వని ఆరోగ్య శాఖ నిర్దారించటం లేదు.ఖమ్మంలో 450 మందికి పరీక్ష చేస్తేనే 190 పైగా కేసులు నమోదైనాయి. అ తర్వాత టెస్ట్ చేయటం లేదు.3 లక్షలు పైగా ఉన్న ఖమ్మం నగరంలో సుమారు పదివేల మంది కరోనా లక్షణాలు ఉన్నవారు ఉంటారని అంచనా వీరందరికి హస్పిటల్స్ సరిపోవు.కాబట్టి ప్రభుత్వం సైతం పట్టించుకునే పరిస్థితిలో లేదు.

* భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంట‌ల్లో దేశవ్యాప్తంగా 48,916 పాజిటివ్ కేసులు న‌మోవ‌ద‌గా, 757 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 13,36,861కు చేర‌గా, మృతుల సంఖ్య 31,358కి పెరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్‌ కేసుల్లో 4,56,071 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 8,49,431 మంది బాధితులు కోలుకున్నారు. ఈ మేర‌కు శనివారం కేంద్ర ఆరోగ్య‌ మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. శుక్రవారం మాత్రమే 4,20,898 న‌మూనాల‌ను ప‌రీక్షించినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా నిర్వహించిన టెస్టుల సంఖ్య 1,58,49,068కు చేరింది.

* కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.ఈ సమావేశం ఈ నెల 27 న జరుగుతుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.ప్రస్తుత కాలంలో దేశంలో కరోనా ఉధృతితో పాటు 3.0 అన్‌లాక్ పరిస్థితులపై కూడా కూలంకశంగా చర్చించనున్నారు.కరోనా తీవ్రత, లాక్‌డౌన్ మొదలవగానే ప్రధాని మోదీ మార్చి మాసంలో మొట్ట మొదటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.తాజాగా జూన్ 16,17 తేదీల్లో… వరుసగా రెండు సార్లు అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ కాన్ఫరెన్స్‌లో కరోనా తీవ్రత, ఆయా రాష్ట్రాలు చేపడుతున్న చర్యలతో పాటు లాక్‌డౌన్ సడలించిన తర్వాతి పరిస్థితులపై సీఎంలతో మోదీ చర్చించిన విషయం తెలిసిందే.