Food

అందానికి ఆలుగడ్డ

అందానికి ఆలుగడ్డ

ఆలుగడ్డ రుచికే కాదు. అందానికీ పనికొస్తుంది. బంగాళదుంప సాయంతో చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసు కోవచ్చు ఇలా…ఉడికించిన రెండు బంగాళ దుంపల గుజ్జుకు రెండు చెంచాల పాలు కలిపి మిక్సీలో వేసి గుజ్జుగా చేసి గోరువెచ్చగా వుండగానే ముఖానికి పట్టించాలి. అరగంట పాటు ముఖాన్ని ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగి, తేలిగ్గా పాల మీగడ రాసి పది నిమిషాల తర్వాత మరోమారు కడిగితే ముఖం కాంతిలీనుతుంది. ఒక పచ్చి బంగాళా దుంప గుజ్జును గ్లాసు నీళ్ళలో వేసి కలిపి మరిగించాలి. నీరు పూర్తిగా ఆవిరై పోగా మిగిలిన గుజ్జును వారానికి రెండుసార్లు ముఖానికి రాసుకుంటే చర్మం మీద పడిన మచ్చలు తొలగిపోతాయి. కేరట్‌ తురుము, పచ్చి పాలు కలిపి రుబ్బి ఈ మిశ్రమాన్ని మెడ, చేతులకి నాలుగైదుసార్లు చొప్పున రాసి పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. దీని ద్వారా చర్మానికి తగినంత పోషణ లభించి కొత్త కాంతిని సంతరించుకుంటుంది.ఉడకబెట్టిన బంగాళాదుంప గుజ్జును రోజూ రాత్రిపూట పడుకోబోయే సమయంలో ముఖానికి రాసి ఉదయాన్నే కడిగితే చర్మం మీది తెగిన, కాలిన గాయాలు, మొటిమలు మటుమాయం అవుతాయి.