NRI-NRT

సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేసిన దక్షిణ అమెరికా దేశాధ్యక్షుడు

సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేసిన దక్షిణ అమెరికా దేశాధ్యక్షుడు

దక్షిణా అమెరికాలోని సురినమే దేశంలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రికాప్రసాద్ సంతోకీ వేదాలసాక్షిగా సంస్కృతంలో ప్రమాణం చేశారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పురోహితుడు చెబుతున్న సంస్కృత శ్లోకాలను చంద్రికా ప్రసాద్ పలుకుతూ ప్రమాణం చేయడం ఈ వీడియోలో గమనించవచ్చు. చంద్రికా ప్రసాద్ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కావడం, అందులోనూ హిందువు కావడం వల్లనే ఈ విధంగా హిందూ సంప్రదాయంలో ప్రమాణ స్వీకారం చేసినట్లు తెలుస్తోంది.