సాధారణంగా మన పూర్వీకులు వాడే మట్టికుండలు ఎంతో మేలు. అవి కాస్త ముతకబడే సరికి దబరలు వచ్చాయి. ఆ తర్వాత నాన్‌స్టిక్ పాన్‌లు. వీటిలో కన్నా మట్టికుండలో వండిన ఆహారమే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ కుండలు మామూలు కూరలు కన్నా నాన్‌వెజ్ చేసుకోవడానికే ఎక్కువ ఉపయోగపడుతుంది. అంతేకాదు ఎంతో రుచితోపాటు, మెత్తగానూ ఉంటాయి. అందుకే కదా ఈ మధ్య రెస్టారెంట్లలో కుండ బిర్యానీ బాగా ఫేమస్ అయింది. ఇందులో వండితే.. చాలాసేపు వేడిగా ఉంటుంది. మళ్లీ మళ్లీ వేడి చేయాల్సిన పని ఉండదు.కుండలో వండిన ఆహారంలో ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, మెగ్నీషియం ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. మూత గట్టిగా పెట్టడం వల్ల పోషకాలు ఆవిరి కాకుండా ఉంటాయి. దీనివల్ల నూనెశాతం తక్కువగా ఉంటుంది.
మట్టికుండలో వండితే అది లాభం
Related tags :