ఇప్పటికే దేశంలో టిక్‌టాక్ తో సహా 59 యాప్‌లను నిషేధించిన భారత ప్రభుత్వం త్వరలో పబ్జీ, అలీ ఎక్స్‌ప్రెస్ మరియు లూడో తో సహా చైనాకు చెందిన 280 యాప్‌లను నిషేదం దిశగా అడుగులు వేస్తున్నది. తాజాగా చైనాలో సర్వర్ ఉన్న యాప్‌లను గుర్తించే పనిలో ఐటీ మాంత్రిత్వ శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 280 యాప్‌లపై ఇప్పటికే నిఘా పెట్టిన కేంద్రం.. డేటా ఏవిధంగా మార్పు జరుగుతోందో సమాచారం సేకరిస్తుంది. చైనాలో సర్వర్‌లు ఉన్న అన్ని యాప్‌లపై నిషేధం విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. నిబంధనల్ని ఉల్లంఘిస్తూ భారత వినియోగదారుల డేటా తస్కరణకు గురవుతున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్రం ముందుంచారు. ఈ యాప్ బ్యాన్‌లకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే దీనిపై భారత్‌ను అనుసరించి చైనా యాప్‌లను నిషేదించాలని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు సైతం ట్రంప్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
PubG ఆలీబాబాలపై ఇండియా నిషేధం
Related tags :