Movies

చంపండి…పాతిపెట్టండి

చంపండి…పాతిపెట్టండి

గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌ కథానాయికలు కంగనా రనౌత్‌-తాప్సిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాప్సి ఓ బి-గ్రేడ్‌ నటి అంటూ ఓ ఇంటర్వ్యూలో కంగనా చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. తాజాగా తాప్సి మరోసారి తన మాటల కత్తికి పదును పెంచారు. ఇన్‌స్టాలో ఓ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను పంచుకుంటూ ఇచ్చిన క్యాప్షన్‌ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

‘విజయంతో వారిని చంపండి. నవ్వుతో పాతి పెట్టండి -బోల్ట్‌’ అంటూ చిరు నవ్వులు చిందిస్తున్న ఫొటో, క్యాప్సన్‌ వైరల్‌ అయ్యాయి. పలువురు బాలీవుడ్‌ నటీమణులు దీనిపై స్పందించారు. దియా మీర్జా ‘హార్ట్‌ సింబల్‌’ను షేర్‌ చేయగా, భూమి పెడ్నేకర్‌ ‘క్యూట్‌’ అంటూ కామెంట్‌ చేశారు. ‘మీరు కళ్లద్దాలు పెట్టుకోండి వాళ్లని సమాధి చేయడం ఇంకా బాగా కనపడుతుంది’ అంటూ నవ్వుతున్న ఎమోజీలు పంచుకున్నాడు ఓ అభిమాని.

తాను కూడా బీ-గ్రేడ్‌ ట్యాగ్‌పై పోరాటం చేశానని కంగన సమర్థించుకునే ప్రయత్నం చేసింది. సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం కోసం చాలా చేశానని చెప్పింది. మ్యాగజైన్‌ కవర్స్‌పై మెరవాలని, అవార్డులు గెలుచుకోవాలని కంగనా కోరుకుందట. ఆ కోరికలు నెరవేరినా.. ఇప్పటికీ తను బీ-గ్రేడ్‌ నటినేనని, తనను సినీ పరిశ్రమలోని వ్యక్తిగా ఒప్పుకోరని ఆవేదన వ్యక్తం చేసింది.