* గవర్నర్ నామినేట్ చేసే ఎమ్మెల్సీల్లో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. వారిని నామినేట్ చేయాలని గవర్నర్ బిశ్వభూషణ్‌ను ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం సిఫార్సుల మేరకు జకియా ఖానం, పాండుల రవీంద్రబాబును ఎమ్మెల్సీలుగా గవర్నర్ నామినేట్ చేశారు. గతంలో కంతేటి సత్యనారాయణ రాజు, టి. రత్నభాయిలు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు ఉండగా.. వారి పదవీకాలం మార్చిలోనే ముగిసింది. దీంతో వారి స్థానాల్లో తాజాగా జకియా ఖానం, రవీంద్రబాబును గవర్నర్ నామినేట్ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
* రాష్ట్రంలో కరోనాపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. ఇటీవల వైకాపాతో విభేదిస్తూ వస్తున్న రఘురామకృష్ణరాజు ప్రస్తుతం దిల్లీలో ఉంటున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కరోనా పరిస్థితులపై స్పందించారు. ‘‘ప్రభుత్వం దృష్టికి ఎవరైనా సమస్యలు తీసుకొస్తే పరిష్కరించాలి. కరోనాపై చర్యలు తీసుకోవాలి. పథకాలన్నింటికీ జగన్ పేరు పెట్టుకోవడం అలవాటైంది. అలాగే జగనన్న కరోనా కేర్ అనో ఏ పేరైనా పెట్టుకోండి. కానీ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలి. కులాలకు అతీతంగా జగనన్న కరోనా కంట్రోల్‌లో సభ్యులు ఉండాలి’’అని ఎంపీ అన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోనూ పీవీకి ఘనంగా నివాళులు అర్పించాల్సిందన్నారు. ఇదే విషయాన్ని సీఎం జగన్‌కు తెలియజేశానని చెప్పారు. పీవీకి ఘన నివాళి విషయంలో ప్రజలు కూడా సీఎంకు లేఖలు రాయాలని పిలుపునిచ్చారు.
* ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంలో ఫార్మా, లైఫ్ సైన్స్ రంగానికి అనేక అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆయన వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన వెబినార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. కరోనాతో నెలకొన్న సంక్షోభం తర్వాత కూడ ఈ రెండు రంగాల్లో అద్భుతమైన అవకాశాలు ఉంటాయన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్‌లో పెట్టుబడుల ఆకర్షణకు ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. జీనోమ్ వ్యాలీ, వైద్య పరికరాల పార్క్, హైదరాబాద్ ఫార్మా సిటీ వంటి ప్రాజెక్టులతో హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడులకు గమ్య స్థానంగా నిలువబోతోందన్నారు. ప్రస్తుతం కరోనా సంబంధిత మందులు, వ్యాక్సిన్లు తయారీలో హైదరాబాద్ తన ప్రాధాన్యతను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిందని పేర్కొన్నారు.
* ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. పార్టీ ముఖ్యనేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తనను ఏపీ అధ్యక్షుడిగా నియమించిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాకు ధన్యవాదాలు తెలిపారు.
* తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ http//tsbie.cgg.gov.in ద్వారా సవరించిన మార్కులు, స్కాన్ చేసిన జవాబు స్క్రిప్టులు డౌన్‌లోడ్ చేసుకోచ్చని తెలిపింది. మొత్తం 37,387 మంది విద్యార్థులు 72,496 సబ్జెక్టుల్లో రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. అయితే ఇప్పటి వరకు 71,298 జవాబు స్క్రిప్టులే తిరిగి ధ్రువీకరించామని, మిగతా 1,198 జవాబు స్క్రిప్టులు నెలాఖరుకి పూర్తవుతాయని తెలిపింది. సవరించిన మెమోలను ఆగస్టు 1 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రకటనలో ఇంటర్‌బోర్డు సూచించింది.
* స్పందన కార్యక్రమంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్నా రిపోర్టుల్లో తగ్గించి చూపే ప్రయత్నం చేయడంలేదని స్పష్టం చేశారు. ఇవాళ ఆరువేలకు పైగా కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారని తెలిపారు. రోజూ చేసే పరీక్షల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. రోజుకు 50వేలకు పైగా పరీక్షలు చేస్తున్న రాష్ట్రం మనదే అని తెలిపారు.
* ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంలో ఫార్మా, లైఫ్ సైన్స్ రంగానికి అనేక అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆయన వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన వెబినార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. కరోనాతో నెలకొన్న సంక్షోభం తర్వాత కూడ ఈ రెండు రంగాల్లో అద్భుతమైన అవకాశాలు ఉంటాయన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్‌లో పెట్టుబడుల ఆకర్షణకు ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు.
* కరోనా వైరస్‌కు కళ్లెం వేసేందుకు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు భారత్ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఐదు ప్రాంతాలను ఎంచుకున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రజా వినియోగానికి అందుబాటులోకి రావడానికి ముందే భారత్‌లో ఈ వ్యాక్సిన్‌పై ప్రయోగాలు చేయడం ఎంతో కీలకమని బయోటెక్నాలజీ విభాగం(డీబీటీ) కార్యదర్శి రేణు స్వరూప్ తెలిపారు. భారత్‌లో వ్యాక్సిన్ తయారీకి నిధులు, వసతుల కల్పన, అనుమతుల జారీ సంస్థగా డీబీటీ వ్యవహరిస్తోంది.
* ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. పార్టీ ముఖ్యనేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తనను ఏపీ అధ్యక్షుడిగా నియమించిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాకు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతను త్రికరణ శుద్ధిగా నిబద్ధతతో నిర్వహిస్తానని స్పష్టం చేశారు. పార్టీని జిల్లా, మండల, గ్రామ స్థాయి వరకు సంస్థాగతంగా బలోపేతం చేయనున్నట్టు సోము వీర్రాజు చెప్పారు.
* తెలంగాణలో కరోనా కేసులకు సంబంధించి హైకోర్టులో విచారణ ముగిసింది. కరోనా నిర్ధారణ పరీక్షలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజల వసూలు తదితర అంశాలకు సంబంధించి దాఖలైన 15 పిటిషన్లపై హైకోర్టులో నేడు సుదీర్ఘ విచారణ జరిగింది. ‘‘కరోనా గణాంకాలు పత్రికలు, టీవీల్లో విస్తృతంగా ప్రచారం చేసేలా చర్యలు తీసుకోవాలి. 21 నుంచి 50ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారన్న విషయాన్ని ప్రచారం చేయాలి. కమ్యూనిటీ హాళ్లలో ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు అంశం పరిశీలించాలి’’ అని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
* జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వేగన్ 2016లో డీజిల్ గేట్ కుంభకోణం బయటకు వచ్చినప్పటి నుంచి సుమారు 9.5 బిలియన్ డాలర్లను డ్రైవర్లకు పరిహారంగా చెల్లించిందని యుఎస్ ఫెడరల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 2015లో ఈ సంస్థ తయారు చేసిన ఇంజిన్ల నుంచి ఉద్గారాలు తక్కువగా వస్తున్నట్లు మభ్యపెట్టామని అంగీకరించింది. అప్పట్లో దీనిని డీజిల్‌గేట్ కుంభకోణంగా అభివర్ణించారు.
* మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహరావు సంస్కరణల వల్లే దేశం ఈ స్థాయిలో ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. పీవీ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోనూ పీవీకి ఘనంగా నివాళులు అర్పించాల్సిందన్నారు. ఇదే విషయాన్ని సీఎం జగన్‌కు తెలియజేశానని చెప్పారు. పీవీకి ఘన నివాళి విషయంలో ప్రజలు కూడా సీఎంకు లేఖలు రాయాలని పిలుపునిచ్చారు.
* కరోనా వైరస్ విలయం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటికే 16 మిలియన్ల మందికి పైగా సోకిన ఈ వైరస్ అందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. దీంతో బయటకు రావాలంటేనే జనం వణుకుతున్నారు. ఉద్యోగులు కార్యాలయాలకు సైతం వచ్చేందుకు భయపడుతున్న పరిస్థితుల్లో ప్రముఖ దిగ్గజ సెర్చింజన్ గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించిన ఈ టెక్ దిగ్గజం.. తాజాగా ఆ గడువును వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించింది.
* ఆహార సరఫరా దిగ్గజం స్విగ్గీలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. ఇప్పటికే మేనెలలో 1,100 మంది ఉద్యోగులను తొలగించిన ఈ సంస్థ ఇప్పుడు మరో 350 మంది ఉద్యోగాల నుంచి తీసివేయాలని నిర్ణయించింది. కొవిడ్ ప్రభావం నుంచి స్విగ్గీ కేవలం 50శాతం మాత్రమే కోలుకొంది. ప్రస్తుతం జరుగుతున్న తీసివేతలు రీస్ట్రక్చరింగ్‌లో తుదివిడతగా కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.
* ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 బాధితుల సంఖ్య కేవలం ఆరువారాల్లోనే రెట్టింపయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ గెబ్రియేసస్ ప్రకటించారు. కరోనా వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించి ఆరు నెలలు పూర్తికావడంతో ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ విధంగా ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించడం చరిత్రలో ఇది ఆరోసారని ఆయన తెలిపారు.