న్యూజిలాండ్ తెలుగు సంఘం(NZTA) ఆధ్వర్యంలో 25వ తేదీన ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వైద్యులు కోవిద్, మెదడుపై దాని ప్రభావం, గుండెపోటులు, పక్షవాతం, మహిళల ఆరోగ్య సమస్యలు, పౌష్ఠికాహారం తదితర అంశాలపై ప్రసంగించారు. డాక్టర్ అనంత ప్రతాపరెడ్డి, డా.విజయ్ పెర్రా, డా.ప్రతిమ, మల్లిక, గిరిరాజ్ తదితరులు ప్రసంగించిన వారిలో ఉన్నారు. 150మంది ప్రవాసులు ఈ సదస్సును సద్వినియోగం చేసుకున్నారు. శ్రీలత మగతల, భవాని, కృష్ణారెడ్డి, అనిత తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించిన NZTA
Related tags :