DailyDose

గుంటురు ప్రభుత్వాసుపత్రిలో గుట్టలుగా శవాలు-TNi బులెటిన్

గుంటురు ప్రభుత్వాసుపత్రిలో గుట్టలుగా శవాలు-TNi బులెటిన్

* గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో పేరుకుపోయిన శవాలుగుంటూరు ప్రభుత్వాసుపత్రిలో పేరుకుపోయిన శవాలుగుంటూరు ప్రభుత్వాసుపత్రిలో శవాలు పేరుకుపోయాయి.ఆసుపత్రి మార్చురీ సామర్ధ్యం 20 మృతదేహాలు కాగా ఇప్పటికే 42 మృత దేహాలు ఉన్నట్టు సమాచారం.పేరుకుపోయిన మృతదేహాలకు సామూహిక ఖననంపై అధికారులు నేడు నిర్ణయం తీసుకోనున్నారుఇప్పటికే 29 మృతదేహాలను గుంటూరు నగర పాలక సంస్థ ఖననం చేసిందని తెలుస్తోంది.చనిపోయిన వారి బంధువులకి ఫోన్లు చేసి చెబుతున్నా మృతదేహాలను తీసుకెళ్లటం లేదని ఎక్కడ భద్రపరచాలో తెలియటం లేదని అధికారులు చెబుతున్నారు.కొందరు వైద్యం చేయించుకోవడానికి వచ్చి చనిపోగానే వారి బంధువులు కరోనా ఉందేమోనన్న భయంతో మృతదేహాలను వదిలేసి వెళుతున్నట్టు తెలుస్తోంది.

* కరోన విజృంభింస్తున్న నేపద్యంలో పరిస్థితులు మన చేయి దాటే అవకాశం ఉన్నందున ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే షాపులు పని చేయాలని, 10 గంటల తర్వాత బయటికి ఎవరు రాకూడదని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్ తెలిపారు.

* గుంటూరుట జీజీహెచ్ నుంచి వ్యక్తి అదృశ్యంగుంటూరు జీజీహెచ్ నుంచి కరోనా పాజిటివ్ వ్యక్తి అదృశ్యమయ్యాడు.ఈ నెల 14వ తేదీన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో సదరు వ్యక్తి చేరాడు.తెనాలి ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు లేక 16 రాత్రి జీజీహెచ్‌కు తరలించారు.జీజీహెచ్‌కు వచ్చిన నాటి నుంచి అతడు కనిపించకుండా పోయాడు.12 రోజుల నుంచి భర్త ఆచూకీ కోసం అతని భార్య వెంకాయమ్మ ఆసుపత్రి చుట్టూ తిరుగుతోంది.ఆసుపత్రిలో ఎన్ని వార్డులు తిరిగినా… ఎంత మందిని అడిగినా సమాధానం చెప్పే వారు లేరు.జీజీహెచ్ అధికారులను అడిగినా ఫలితం లేదని భార్య ఆవేదన వ్యక్తం చేసింది.తన భర్త ఏమైపోయాడో చెప్పండని జీజీహెచ్ వద్ద భార్య కన్నీరు మున్నీరవుతోంది.

* మొత్తం ఈరోజు కరోనా పాజిటివ్ కేసులు- 1367కాకినాడ అర్బన్ కరోనా పాజిటివ్ కేసులు -338కాకినాడ రూరల్ కరోనా పాజిటివ్ కేసులు -90కరప మండలం కాకినాడ రూరల్ కరోనా పాజిటివ్ కేసులు -22

* ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇవాళ 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారని వివరించారు. కానీ కేసులు ఎక్కువగా వస్తున్నాయని రిపోర్టుల్లో తగ్గించి చూపే ప్రయత్నం చేయడం లేదని స్పష్టం చేశారు.

* ?కరోనా పరీక్షల ధరలు నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం?అమరావతి: ప్రభుత్వం నుంచి పంపే కరోనా నమూనాలు, ప్రైవేటుగా సేకరించే నమూనాల పరీక్షలకు ఏపీ ప్రభుత్వం ధరలు నిర్ణయించింది.?ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేయడంతోపాటు ఐసీఎంఆర్‌ అనుమతించిన ప్రైవేటు ల్యబ్‌లలో కొవిడ్‌ పరీక్షలకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.?ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లలో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలకు రూ. 750 కంటే ఎక్కువ వసూలు చేయొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్టీపీసీఆర్‌ ద్వారా చేసే పరీక్షకు రూ. 2800 ధరను నిర్ణయించింది.?ఈ మొత్తంలోనే ర్యాపిడ్‌ కిట్‌తోపాటు పీపీఈ కిట్లు ఉంటాయని తెలిపింది. మానవవనరుల వ్యయం కూడా ఈ ధరలోనే ఉంటుందని స్పష్టం చేసింది.?కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు ఆరోగ్యశ్రీ ట్రస్టు ఈసీవోకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.

* దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్కరోజులో 47,704 కేసులు రాగా.. 654 మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 14,83,157కి చేరింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 4,96,988 మంది చికిత్స పొందుతుండగా.. 9,52,743 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్ఛార్జి అయినట్లు కేంద్రం తెలిపింది. కరోనాతో ఇప్పటి వరకు 33,425 మంది ప్రాణాలు కోల్పోయారు.