చర్మం బిగుతుగా కనిపించి యౌవనంతో మెరిసిపోవడానికి క్రీములు, ఫేస్ వాష్‌లే కాదు…రకరకాల క్లేలు కూడా మార్కెట్‌లో దొరుకుతున్నాయి. వాటితో ఎలాంటి ప్రయోజనా లున్నాయో తెలుసుకుందామా..
ముల్తానీమట్టి: జిడ్డు చర్మానికి చక్కటి ఔషధం. దీనిలోని బ్లీచింగ్ గుణాలు చర్మ ఛాయని మెరుగుపరుస్తాయి. అలాగని రోజూ వేసుకుంటే చర్మం పొడిబారుతుంది. కీరదోస రసం లేదా పెరుగు, చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. పావుగంటాగి గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి. ముఖం తాజాగా కనిపిస్తుంది.
గ్రీన్ క్లే: సముద్రంలోని నాచుతో తయారుచేసే ఈ క్లేలో ఎంజైములు, ఖనిజాలు పుష్కలం. దీన్ని చర్మ సంరక్షణకు ఉపయోగిస్తే యౌవనంతో మెరిసిపోతుంది ముఖం. ముడతలు తగ్గి నిగారింపుతో కనిపిస్తుంది.
కెవోలిన్ క్లే: చూడ్డానికి తెల్లగా, మెత్తగా ఉండే ఈ క్లే…చర్మానికి నునుపుదనం తెస్తుంది. ముఖంపై సహజ నూనెల్ని కాపాడుతూ…మెరిసేలా చేస్తుంది. ఏవైనా ప్రత్యేక సందర్భాలప్పుడు దీన్ని పూతలా వేసుకోండి. తక్కువ సమయంలో దీనిలోని సుగుణాలు మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి.
కెవోలిన్ క్లేతో బిగుతుగా మారే చర్మం
Related tags :