ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 13వ సాహిత్య సదస్సు వార్షికోత్సవం, 156వ నెలనెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సుని ఆదివారం నాడు నిర్వహించారు. శారదా కాశీవఝ్జల, డా.గీతామాధురిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేములపల్లి శ్రీకృష్ణ రచించిన “చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా” ప్రార్థనా గీతాన్ని సాహితి,సింధులు ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డా.యు.నరసింహారెడ్డి తెలుగు సిరిసంపదలు అనే జాతీయాలు, పొడుపు కథలను, డాక్టర్ ఉపద్రష్ట సత్యం శ్రీకృష్ణదేవరాయల “ఆముక్త మాల్యద” ప్రబంధం నుండి “పూచినమావులం దవిలి…పరుమేలు తీరినన్” అన్న వసంతఋతు వర్ణన పద్యాన్ని అందులోని విశేషాలను, కర్నాటక సంగీత అగ్రజులు శ్యామశాస్త్రి జీవిత విశేషాలపై వేముల లెనిన్‌బాబు, “మాతృభాష మనుగడకు మనవంతు బాధ్యత” అనే అంశంపై శారద, “దేవులపల్లి కృష్ణశాస్త్రి లలితగీతాలు” అనే అంశంపై డా.కె.గీతలు ప్రసంగించి ఆహుతులను ఆకట్టుకున్నారు. TANTEX అధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరు, కార్యవర్గ బృందం సభికులకు ధన్యవాదాలతో కార్యక్రమం ముగించారు.
దేవులపల్లి లలితగీతాలపై టాంటెక్స్ సదస్సు
Related tags :