ముస్లింలు పవిత్ర హజ్ యాత్ర మొదలుపెట్టారు.
దుబాయ్ నుంచి మక్కాకు ఇవాళ ఉదయం హజ్ యాత్రికులు బయలుదేరారు.
కరోనా వైరస్ నేపథ్యంలో అయిదు రోజుల యాత్ర నిర్వహణకు సౌదీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
ముస్లింలు తమ జీవితకాలం ఒకసారైనా మక్కా సందర్శిస్తారు.
అయితే ఈ సారి కరోనా ఆంక్షల వల్ల కేవలం పది వేల మందికి మాత్రమే హజ్ యాత్రకు అవకాశం కల్పించారు.
గత ఏడాది దాదాపు 25 లక్షల మంది యాత్రికులు మక్కా వెళ్లారు.
ఈసారి సెక్యూర్టీ ఆంక్షలు లేకపోయినా కరోనా మహమ్మారి నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తున్నారు.
యాత్రికులు మాస్క్‌లు ధరించి, సోషల్ డిస్టాన్స్ పాటించాల్సి ఉంటుంది.
యాత్రికులు మక్కాలో ఉన్న పవిత్ర ప్రాంతాలను హజ్‌యాత్ర వేళ అయిదు రోజుల్లో చుట్టివస్తారు.
ఈ ప్రాంతాలన్నీ పశ్చిమ సౌదీ అరేబియాలో ఉంటాయి.